- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంజనీరింగ్ లో కొత్త కోర్సులపై టి.సాట్ ప్రత్యక్ష ప్రసారం
ఇంజనీరింగ్ లో కొత్త కోర్సులు, బ్రాంచ్ల ఎంపిక, విద్య, ఉద్యోగ అవకాశాలతో సహ ఉస్మానియా విశ్వ విద్యాలయం అందిస్తున్న వివిధ కోర్సులపై విద్యార్ధులు తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఉస్మానియా యూనివర్సీటి వైస్ చాన్స్ లర్ ప్రొ. కుమార్ మొలుగరం తో టి-సాట్ ప్రత్యక్ష్య కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం ప్రసారం చేస్తున్నట్లు టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ఇంజనీరింగ్ లో కొత్త కోర్సులు, బ్రాంచ్ల ఎంపిక, విద్య, ఉద్యోగ అవకాశాలతో సహ ఉస్మానియా విశ్వ విద్యాలయం అందిస్తున్న వివిధ కోర్సులపై విద్యార్ధులు తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఉస్మానియా యూనివర్సీటి వైస్ చాన్స్ లర్ ప్రొ. కుమార్ మొలుగరం తో టి-సాట్ ప్రత్యక్ష్య కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం ప్రసారం చేస్తున్నట్లు టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజనీరింగ్‌లో టాప్ బ్రాంచ్‌లు రోబోటిక్స్ ఇంజినీరింగ్ లో ఉద్యోగ అవకాశాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంజినీరింగ్ ప్రత్యేకతలు, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ తదితర విభాగాల్లో ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి? ఇంజినీరింగ్ చేసిన వారు ఎక్కువగా విదేశాలకు వెళ్ళడానికి కారణాలు ఏమిటి? వంటి ప్రశ్నలకు వీసీ ఈ మేరకు విద్యార్ధులకు సమాధానాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉదయం 11.30 నుండి మద్యాహ్నం 12.30 వరకు లైవ్ షోలో 040 23540326, 23540726 ,టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 4039 లను సంప్రదించవచ్చని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.
- Tags
- T sat





