- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసులను ఉపసంహరించుకోవాలి: టీఎస్ యూటీఎఫ్ డిమాండ్
ప్రముఖ మీడియా విశ్లేషకుడు, విశ్రాంత ప్రొఫెసర్ నాగేశ్వర్ పై ఆంధ్రప్రదేశ్ లోని వివిధ పోలీసు స్టేషన్లలో బనాయించిన కేసులను ఉపసంహరించుకోవాలని టీఎస్ యూటీఎఫ్ డిమాండ్ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రముఖ మీడియా విశ్లేషకుడు, విశ్రాంత ప్రొఫెసర్ నాగేశ్వర్ పై ఆంధ్రప్రదేశ్ లోని వివిధ పోలీసు స్టేషన్లలో బనాయించిన కేసులను ఉపసంహరించుకోవాలని టీఎస్ యూటీఎఫ్ డిమాండ్ చేసింది. ఆయనను అరెస్టు చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఏ వెంకట్ డిమాండ్ చేశారు. గత, ప్రస్తుత ముఖ్య మంత్రులతో సహా రాష్ట్రంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఏదో ఒక సందర్భంలో ఆయన సలహాలు తీసుకున్నవారేనని వివరించారు.
ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు అసభ్యంగానో, వ్యక్తిగత విమర్శలో కావని, ఆయన వ్యాఖ్యలు నచ్చనివారు ప్రజాస్వామ్యయుతంగా ఖండించవచ్చని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమైన వెంటనే వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారని, ఏపీ సీఎం జోక్యం చేసుకొని కేసులను ఎత్తివేసి ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని కోరుతున్నట్లు తెలిపారు.






