- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TS Elections : 119 నియోజకవర్గాల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలివే..!
తెలంగాణ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. ఇక పోలింగ్‌కు రెండు రోజులే మిగిలి ఉండటంతో పార్టీలు పోల్ మేనేజ్ మెంట్‌పై ఫోకస్ చేశాయి. తెలంగాణలో మొత్తం 35వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ కేంద్రాలకు ఈవీఎంల పంపిణీ పూర్తయింది. దివ్యాంగులు, వృద్ధుల కోసం వీల్ చైర్‌లను అందుబాటులో ఉంచారు.
సమస్యాత్మక కేంద్రాలు ఎన్నంటే..?
తెలంగాణలో 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుండగా 49 చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక, 12 వేల క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను ఈసీ గుర్తించింది. ఆయా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర బలగాలను పంపాలని ఇప్పటికే ఈసీ ఆదేశించింది. కౌంటింగ్ సమయంలో ఒక్కో కౌంటింగ్ కేంద్రానికి ఒక్కో అబ్జర్వర్‌ను ఈసీ నియమించనుంది. ప్రచార గడువు ముగిసిన తర్వాత రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఈసీ వార్నింగ్ ఇచ్చింది. ఇక ఎలక్షన్ కోడ్ అమలైన నాటి నుంచి ఇప్పటి వరకు కోడ్ ఉల్లంఘించినందుకు దాదాపు వెయ్యికి పైగా కేసులు నమోదు చేసింది.






