TS Elections : ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ టాప్.. సీజ్ చేసిన డబ్బు ఎంతంటే..?

by Disha Web Desk 4 |
TS Elections : ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ టాప్.. సీజ్ చేసిన డబ్బు ఎంతంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్నందున అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇక, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేలా పెద్ద మొత్తంలో నగదును ఆయా పార్టీల అభ్యర్థులు సమకూర్చుకోవడంలో బీజీ అయ్యారు. ఇదే క్రమంలో భారీగా నగదును పోలీసులు సీజ్ చేస్తూ వస్తున్నారు. తెలంగాణతో పాటు ఎన్నికలు జరుగుతున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరంలను దాటేస్తూ మన రాష్ట్రంలో రికార్డు స్థాయిలో డబ్బు పట్టుబడింది.

అక్టోబర్ 10 నుంచి కోడ్ అమల్లోకి రావడంతో తెలంగాణలో ఇప్పటి వరకు రూ.659.2 కోట్ల ఆస్తులను అధికారులు సీజ్ చేశారు. రాజస్థాన్ లో 650.7 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేశారు. ఐదు రాష్ట్రాల్లో 372.9 కోట్ల నగదు పట్టుబడగా ఒక్క తెలంగాణలోనే రూ.225.23 కోట్లు పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటి వరకు ఐదు రాష్ట్రాల్లో రూ.1760 కోట్ల ఆస్తులను సీజ్ చేసినట్లు ఈసీ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మిగిలిన వాటిలో మద్యం, డ్రగ్స్, విలువైన వస్తువులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో కార్యకర్తలు, ప్రధాన అనుచరుల ఇళ్లలో నాయకులు భారీగా డబ్బును ఉంచుతున్నారు. ఎన్నికలకు ముందు రోజు రాత్రి కళ్లా ఎలాగైనా తమ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసేలా ఆయా పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు స్కెచ్ వేస్తున్నారు.

Next Story