- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TS Elections : తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన పోలింగ్
తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్ లో ఎన్నికలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఐదంచల భద్రతను ఏర్పాటు చేశారు. వెయ్యి వరకు సమస్యాత్మక కేంద్రాలను గుర్తించిన ఎన్నికల అధికారులు ఆ పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలను మోహరించారు. ఎన్నికలు ముగిసే వరకు హైదరాబాద్ లో 144 సెక్షన్ కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 35,655 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 3.26 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు దాదాపు లక్ష మంది రాష్ట్ర పోలీసులు, కేంద్ర పారామిలిటరీ బలగాలు, ఇతర రాష్ట్రాల హోంగార్డులను ఎలక్షన్ కమిషన్ వినియోగిస్తున్నది. సుమారు రెండు లక్షల మందికి పైగా ప్రభుత్వ సిబ్బందిని ఎన్నికల విధుల్లో ఈసీ నియమించింది. ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నది. అప్పటి వరకు క్యూలో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 4.00 గంటలకే ముగియనున్నది. మొత్తం 59,779 ఈవీఎం (బ్యాలట్ యూనిట్ల)లను వినియోగిస్తున్నది.






