- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది.. ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్
ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని.. నేషనల్ హెరాల్డ్ కేసులో అదే జరిగిందని తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని.. నేషనల్ హెరాల్డ్ కేసులో అదే జరిగిందని తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) అన్నారు. ఇవాళ టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆధ్వర్యంలో గాంధీభవన్ నుంచి బీజేపీ ఆఫీసు వరకు నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. బీజేపీ (BJP) పెడుతున్న అక్రమ కేసుల గురించి ప్రజలకు వాస్తవాలు చెబుతామని అన్నారు. గాంధీ కుటుంబంపై బీజేపీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకానికి ఉన్న గాంధీ పేరును సైతం తొలిగిస్తున్నారని ఫైర్ అయ్యారు. న్యాయం జరగడానికి సమయం పట్టొచ్చు.. కానీ చివరికి సత్యమే గెలుస్తోందని అన్నారు. నేషనల్ హెరాల్డ్ పేపర్ గురించి బీజేపీకి ఏమి తెలియదని అన్నారు. తమది అహింస మార్గమని.. అందుకే శాంతియుతంగా నిరసన చేసి ప్రజలకు వాస్తవాలు తెలిజేస్తామని మీనాక్షి నటరాజన్ అన్నారు.






