- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రవాస భారతీయులకు షాకిచ్చిన ట్రంప్.. గ్రీన్‌కార్డ్ లాటరీ ప్రోగ్రామ్‌ను నిలిపివేత
ప్రవాస భారతీయులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో షాకిచ్చాడు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రవాస భారతీయులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో షాకిచ్చాడు. ఈ మేరకు గ్రీన్ కార్డు లాటరీ ప్రోగ్రామ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే, ఇటీవల బ్రౌన్ యూనివర్సిటీ, MIT కాల్పుల ఘటనల నేపథ్యంలో కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోమ్ (Christi Nome) సోషల్ ప్లాట్‌ఫాం X (ట్విట్టర్) వేదికగా ట్రంప్ ఆదేశాల మేరకు యూనైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS)ని ఈ కార్యక్రమాన్ని పాజ్ చేయమని ఆదేశించినట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా క్రిస్టి మాట్లాడుతూ.. 48 ఏళ్ల పోర్చుగీస్ జాతీయుడు క్లాడియో నెవెస్ వాలెంటే (Claudio Neves Valente) బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పులు జరిపిన ఘటనలో ఇద్దరు విద్యార్థులు చనిపోయారని, మరో తొమ్మిది మంది గాయపడ్డారని పేర్కొన్నారు. 2017లో నెవెస్ వాలెంటే లాటరీ ప్రోగ్రామ్ ద్వారా గ్రీన్ కార్డును పొందాడని తెలిపారు. కాగా, డైవర్సిటీ వీసా కార్యక్రమం ప్రతి సంవత్సరం లాటరీ ద్వారా అమెరికాలో తక్కువగా ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాల నుంచి 50 వేల గ్రీన్ కార్డులను అందిస్తుంది. 2025 వీసా లాటరీకి దాదాపు 20 మిలియన్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. భార్యాభర్తలతో కలిపి 1,31,000 మంది ఎంపికయ్యారు. పోర్చుగీస్ పౌరులకు కేవలం 38 స్లాట్లు మాత్రమే దక్కాయి. లాటరీ గెలిచిన వారు గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వారు ఆయా అమెరికా కాన్సులేట్లలో నిర్వహించే ఇంటర్వ్యూల్లో పాల్గొని పాస్ అయితే వారికి గ్రీన్ కార్డు ద్వారా శాశ్వత నివాస హోదా లభిస్తుంది.






