గ్లోబల్ సమ్మిట్‍లో తొలి రోజే సంచలనం.. భారీ ఇన్వెస్ట్ మెంట్‍కు ట్రంప్ మీడియా టెక్నాలజీస్ రెడీ

by Prasad Jukanti |   (  Updated:2025-12-08 09:35:16  IST  )

గ్లోబల్ సమ్మిట్ లో పెట్టుబడుల ప్రవాహం మొదలైంది.

గ్లోబల్ సమ్మిట్‍లో తొలి రోజే సంచలనం.. భారీ ఇన్వెస్ట్ మెంట్‍కు ట్రంప్ మీడియా టెక్నాలజీస్ రెడీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మింట్ (Telangana Rising Global Summit) కొనసాగుతోంది. ఈ సమ్మిట్ వేదికగా తెలంగాణలో పెట్టుబడులపై ట్రంప్ మీడియా టెక్నాలజీస్ (Trump Media Technologies) కీలక ప్రకటన చేసింది. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ మీడియా టెక్నాలజీస్ డైరెక్టర్ ఎరిక్ ప్రకటించారు. ఇవాళ గ్లోబల్ సమ్మింట్ లో మాట్లాడిన ఎరిక్.. తెలంగాణలో వచ్చే పదేళ్లలో రూ. లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని వెల్లడించారు. కాగా హైదరాబాద్‌లో ఓ ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదన చేసిన సంగతి తెలిసిందే. నగరంలోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం పక్కన ఉన్న కీలక రహదారికి "డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ"గా నామకరణం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Next Story