TRTF: పీఆర్సీ, డీఏలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి : టీఆర్‌టీఎఫ్ విజ్ఞప్తి

by Ramesh Naini |

2026–27 వార్షిక బడ్జెట్‌లో రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిచ్చి, తగిన నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరింది.

TRTF: పీఆర్సీ, డీఏలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి : టీఆర్‌టీఎఫ్ విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో : 2026–27 వార్షిక బడ్జెట్‌లో రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిచ్చి, తగిన నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరింది. రిటైరైన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, కమ్యుటేషన్ తదితర పెన్షనరీ బెనిఫిట్స్ అందకపోవడంతో వారు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరినట్టు టీఆర్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

జులై 2023 నుండి పెండింగ్‌లో ఉన్న నూతన వేతన సవరణ కమిషన్ నివేదికను సత్వరం తెప్పించుకొని, అవసరమైన నిధులను బడ్జెట్‌లో కేటాయించాలని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు కరువు భత్యం వాయిదాలను బకాయిలతో సహా వెంటనే విడుదల చేయాలని లేఖలో విన్నవించారు. సి.పి.ఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలను చెల్లించడంతో పాటు 2005 నుండి జిల్లా పరిషత్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్‌కి సంబంధించి పేరుకుపోయిన వడ్డీ మొత్తాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తిస్థాయిలో చెల్లించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

Next Story