- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మూతి పళ్లు రాలగొడుతా’.. కట్టలు తెంచుకున్న కవిత కోపం
తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త వేడి పుట్టిస్తూ తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త వేడి పుట్టిస్తూ తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు- సాధన' రౌండ్ టీబుల్ సమావేశంలో ఆమె ముఖ్య అతిధిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ఏపీ అధికార కూటమి నేతలపై ఆమె నిప్పులు చెరిగారు. "నేను మొండిదాన్ని. మీరు అనుకున్నంత మంచిదాన్ని కాదు. మేము అధికారంలోకి రాగానే ఇక్కడున్న ఆంధ్రా నాయకుల విగ్రహాలు పగలకొట్టి, ఆంధ్రాకు పార్సల్ పంపిస్తాం. మా అస్తిత్వంపై దాడి చేస్తూ, మీ సంస్కృతిని మాపై రుద్దుతామంటే చూస్తూ ఊరుకోం." అని కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మూతి పళ్లు రాలుతాయి..
తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని కవిత స్పష్టం చేశారు. "ఇది టీఆర్ఎఎస్ 2.0. మాతో పెట్టుకుంటే మంచిగా ఉండదు. ఒకసారి పెట్టుకుంటేనే తెలంగాణ తెచ్చుకున్నాం. మళ్లీ మా జోలికి వస్తే మూతి పళ్లు రాలుతాయి అని హెచ్చరించారు. తెలంగాణలో ప్రస్తుతం ఆంధ్రా రాజకీయ నాయకుల ఏజెంట్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నాడనీ, అందునే ఇక్కడ ఆంధ్రా నాయకుల విగ్రహాలు పెడుతూ, ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇదేదో యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు ఒక కుట్ర ప్రకారం మన అస్తిత్వంపై దాడి చేస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్, యాదగిరి లాంటి మేధావులు మాట్లాడితే ఆంధ్రా పోలీసులు వచ్చే ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు.
పవన్ కల్యాణ్, లోకేష్‌లపై ఘాటు విమర్శలు..
రాష్ట్రం ఏర్పడి 13 ఏళ్లవుతున్నా ఆంధ్రాలో రాజధాని కట్టుకోవడం చేతగాక, ప్రజలను డైవర్ట్ చేయడానికి ఇక్కడ డ్రామాలు చేస్తున్నారు. టీడీపీ, జనసేన కూటమి అసెంబ్లీలో కాకుండా పార్లమెంట్ రాజధాని తీర్మానం చేయించుకుంటే, జగన్ మావిగన్ పేరుతో పొలిటికల్ బాంబ్ వేశారు. రాజధాని నిర్మాణంలో వీరు పూర్తిగా ఫెయిల్ అయ్యారు. పవన్ కల్యాణ్ తెలంగాణలో నవ నిర్మాణ సభ పెట్టేముందు, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చలేదని కవిత విమర్శించారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని, రేపటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఉద్యమకారుల హామీలపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కోదండరాం లాంటి ఒకరిద్దరికి న్యాయం జరిగితే సరిపోదని హితవు పలికారు.






