నెలరోజులు టీఆర్ఎస్ జెండా పండుగ

by velandi.Saikiran |

రాష్ట్ర వ్యాప్తంగా ఒకే మోడల్‌లో తెలంగాణ రక్షణ సేన జెండా గద్దెలు నిర్మిస్తున్నట్లు పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత తెలిపారు.

నెలరోజులు టీఆర్ఎస్ జెండా పండుగ
X

నెలరోజులు టీఆర్ఎస్ జెండా పండుగ

- టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత

- జెండా గద్దె మోడల్ ఆవిష్కరణ

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ఒకే మోడల్‌లో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండా గద్దెలు నిర్మిస్తున్నట్లు పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత తెలిపారు. బంజారాహిల్స్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం స్టేట్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా గద్దెల మోడల్‌ను ఆవిష్కరించారు. మూడు ఫీట్ల ఎత్తు, రెండు ఫీట్ల వెడల్పుతో పార్టీ జెండా గద్దెలు నిర్మించాలని కవిత సూచించారు. పార్టీ జెండా గద్దె బేస్ ఒక ఫీట్ ఎత్తులో ఉంటుందని.. పైభాగం మరో రెండు ఫీట్ల ఎత్తులో ఉంటుందని తెలిపారు.

జెండా గద్దె బేస్‌కు గ్రీన్ కలర్.. పైభాగంలో ఉండే జెండా గద్దెకు ఎల్లో కలర్, దాని మధ్యలో తెలంగాణ మ్యాప్ బ్లూ కలర్‌లో ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణ మ్యాప్ మధ్యలో ఇంగ్లిష్ అక్షరాల్లో టీఆర్ఎస్ అని రాయాలని సూచించారు. జెండా గద్దె బేస్ గ్రీన్ కలర్ మధ్యలో తెలుగులో తెలంగాణ రక్షణ సేన అని రాయాలని సూచించారు. పార్టీ జెండా కలర్ కోడ్స్ సైతం తాము ఇచ్చిన విధంగానే చూసుకోవాలని.. అప్పుడే రాష్ట్రవ్యాప్తంగా జెండాలన్నీ ఏకరూపంలో ఉంటాయని వెల్లడించారు. కాగా.. ఈనెల 20వ తేదీ నుంచి జూన్ 20 వరకు జెండా పండుగను నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

Next Story