TG News : సామాజిక న్యాయ సమరభేరి సభలో సిగాచీ మృతులకు నివాళి

by Muthe.Rajitha |   (  Updated:2025-07-04 13:29:39  IST  )

ఇటీవల పాశమైలారం(Pashamylaram) పారిశ్రామిక వాడలో జరిగిన సిగాచీ ప్రమాదం(Sigachi Explosion)లో 40 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

TG News : సామాజిక న్యాయ సమరభేరి సభలో సిగాచీ మృతులకు నివాళి
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల పాశమైలారం(Pashamylaram) పారిశ్రామిక వాడలో జరిగిన సిగాచీ ప్రమాదం(Sigachi Explosion)లో 40 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే నేడు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి సభ(Congress Samarabheri Sabha)లో సిగాచి పేలుడు ఘటనలో మృతి చెందినవారికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంతాపం(Condolence) తెలిపారు. రెండు నిమిషాల పాటు నాయకులు, శ్రేణులు లేచి నిలబడి మౌనం పాటించారు. కాగా కాంగ్రెస్ సామాజిక న్యాయ సమర భేరి సభకు ముఖ్య అతిధిగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే హాజరవగా.. సీఎం రేవంత్ రెడ్డి సహ రాష్ట్ర అధినాయకత్వం, మంత్రులు ఎమ్మెల్యేలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

Next Story