- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Namballa Kesha Rao: నంబాళ్ల కేశవరావుకు బ్రెజిల్ లో నివాళి
ఈ ఏడాది మే నెలలో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన వోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుకు నివాళిగా బ్రెజిల్ లో సమావేశం నిర్వహించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ ఏడాది మే నెలలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (Namballa Kesava Rao) అలియాస్ బసవరాజుకు నివాళిగా బ్రెజిల్ (Brazil)లో సంతాప సమావేశం నిర్వహించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) నేతృత్వంలోని భారత విప్లవానికి మద్దతుని ప్రకటిస్తూ నంబళ్ల కేశవరావు గౌరవార్థం ఆగస్ట్ 7న యాంటీ-ఇంపీరియలిస్ట్ లీగ్ (ఎఐఎల్- సామ్రాజ్యవాద వ్యతిరేక లీగ్) నిర్వహించిన ఫెడరల్ యూనివర్శిటీ ఆఫ్ ఏబీసీ పాలిస్టా (యూఎఫ్‌ఏబీసీ)కి చెందిన శాంటో ఆండ్రే క్యాంపస్‌లో కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి ప్రజాస్వామిక, అభ్యుదయవాదులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా మధ్య-తూర్పు భారతదేశంలోని రెడ్ కారిడార్ అని పిలిచే ప్రాంతంలో గెరిల్లాలు, సీపీఐ (మావోయిస్ట్) నేతృత్వంలోని ప్రజల దైనందిన జీవితాలను వర్ణించే ఒక రిపోర్టును ఈ సందర్భంగా ప్రదర్శించారు.
అంతర్జాతీయ నిధి..
ఈ సమావేశంలో ఎఐఎల్, విద్యార్థి ఉద్యమం ‘డాన్ ఆఫ్ ది పీపుల్’ ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విప్లవ పోరాటాలను రక్షించే అంతర్జాతీయ విధిని గురించి నొక్కి చెప్పారు. బ్రెజిల్, భారతదేశం వంటి సామ్రాజ్యవాద, అర్ధ-భూస్వామ్య దోపిడీ ద్వారా అణచివేతకు గురవుతున్న దేశాలలో నూతన ప్రజాస్వామిక విప్లవ అవసరాన్ని గురించి వివరించారు. దేశంలోని విస్తారమైన జాతీయ సంపదను, ముఖ్యంగా అరుదైన-భూమి వనరులను దోచుకొనే లక్ష్యంతో అమెరికా బ్రెజిల్‌పై విధించిన ఆంక్షలను ఉదాహరణగా చూపిస్తూ ప్రపంచంలోని పీడిత ప్రజలపైన అమలవుతున్న సామ్రాజ్యవాద దురాక్రమణలను ఖండించారు. ఏఎన్‌డీ చారిత్రాత్మక జనరల్ డైరెక్టర్ కామ్రేడ్ ఫౌస్టో అర్రుడా గౌరవార్థం తీసుకువచ్చిన ఒక ప్రత్యేక సంచికను, ఇతర ప్రచురణలను ఇక్కడ ప్రదర్శనకు పెట్టారు.






