ఆదివాసీ యువత నాయకులుగా ఎదగాలి : బెల్లయ్య నాయక్

by Muthe.Rajitha |   (  Updated:2025-07-29 15:46:24  IST  )

తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్ అధ్యక్షులు బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్ శిక్షణ శిబిరాన్ని నిజామాబాద్‌లో నిర్వహించారు.

ఆదివాసీ యువత నాయకులుగా ఎదగాలి : బెల్లయ్య నాయక్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్ అధ్యక్షులు బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్ శిక్షణ శిబిరాన్ని నిజామాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెల్లయ్య నాయక్ కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ ఆలోచనలతో కుల గణన చేపట్టిందని అన్నారు. ఆదివాసీ యువత నాయకులుగా ఎదగాలి, స్థానిక ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేయాలని పేర్కొన్నారు. బీజేపీ హయాంలో ఆదివాసీ హక్కులు, రాజ్యాంగ విలువలు దెబ్బతిన్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి, ఆదివాసీ బిడ్డల కోసం పనిచేస్తుందని తెలిపారు. ఉన్నత చదువులతో ఆదివాసీ యువత అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు భూపతి రెడ్డి, సుదర్శన్ రెడ్డితోపాటు సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు యాదగిరి తదితరులు హాజరయ్యారు.

Next Story