- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆదివాసీ గ్రామాలు అద్దాల్లా.. మెరవాలి! గిరిజన సంక్షేమ శాఖ తీర్మానం
ఆదివాసీ గ్రామాలను సమర్ధవంతంగా అభివృద్ధి చేయాలని రాష్ట్రంలోని ఆదివాసీ, గిరిజన ఎమ్మెల్యేలు తీర్మానించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఆదివాసీ గ్రామాలను సమర్ధవంతంగా అభివృద్ధి చేయాలని రాష్ట్రంలోని ఆదివాసీ, గిరిజన ఎమ్మెల్యేలు తీర్మానించారు. ఆదివాసీ ఆవాసాలు, గూడెంలు, తండాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని నిర్ణయం తీసుకున్నారు. రోడ్లు, మౌలిక వసతులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం ట్రైకార్ చైర్మన్ డాక్టర్ తేజ నాయక్ ఆధ్వర్యంలో మాసాబ్ ట్యాంక్ డీఎస్ఎస్ సంక్షేమ భవన్లో రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, గిరిజన, ఆదివాసీ ఎమ్మెల్యేలు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడమ బొజ్జు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ హాజరయ్యారు. బడ్జెట్ లో ట్రైకార్ కు కేటాయించిన రూ.360 కోట్ల నిధులను సంపూర్ణంగా వినియోగిస్తూ పేదలకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంచి స్కీమ్ లను ఎంపిక చేసి, సమర్ధవంతంగా పంపిణీ చేయాలన్నారు. అవసరమైతే కేంద్రం నిధులు తీసుకునేందుకు కూడా ముందుకు సాగాలని తీర్మానించారు. సీఎం రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకొని రాష్ట్రపతి, పీఎం లను కలవాలని నిర్ణయం తీసుకున్నారు.






