తహశీల్దార్లకు పదోన్నతి కల్పించండి.. సీఎంకు ట్రెసా రిక్వెస్ట్

by Bhoopathi Nagaiah |

రాష్ట్రంలో 13 ఏండ్లుగా తహశీల్దార్లుగా పని చేస్తోన్న 100 మందికి వెంటనే డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని ట్రెసా అధ్యక్షుడు వంగ రవీంధర్ రెడ్డి కోరారు.

తహశీల్దార్లకు పదోన్నతి కల్పించండి.. సీఎంకు ట్రెసా రిక్వెస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 13 ఏండ్లుగా తహశీల్దార్లుగా పని చేస్తోన్న 100 మందికి వెంటనే డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు వంగ రవీంధర్ రెడ్డి కోరారు. సోమవారం సీఎంని కలిసి రెవెన్యూ శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పదోన్నతుల ద్వారా కింది స్థాయి వరకు సిబ్బందికి అవకాశాలు మెరుగుపడుతాయని అన్నారు. గత ఎన్నికలలో బదిలీపై వెళ్లి, సొంత జిల్లాలకు తిరుగు బదిలీలు కల్పించని తహశీల్దార్లను బదిలీ చేయాలని కోరారు. చాలా ఏండ్లుగా రెవెన్యూ శాఖలో పని చేస్తోన్న ఔట్‌సోర్సింగ్ ఆపరేటర్లను కొనసాగించాలన్నారు. రెగ్యులరైజ్ చేయబడిన వీఆర్ఏల విషయంలో పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాల అంశాన్ని తేల్చాలన్నారు. సమస్యలను విన్న సీఎం రేవంత్ రెడ్డి అంశాలపై చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు రవీంధర్ రెడ్డి తెలిపారు. సీఎంని కలిసిన వారిలో వంగా రవీంధర్ రెడ్డితో పాటు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి ఉన్నారు.

Next Story