తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి.. మంత్రిని కోరిన ట్రెసా

by Bhoopathi Nagaiah |

తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (టెస్రా) నాయకులు ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి.. మంత్రిని కోరిన ట్రెసా
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ పటిష్టతకు అనేక చర్యలు చేపట్టి 5,601 మంది జీపీవోల నియామకం, సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల వ్యవస్థను తీసుకొచ్చి 33 మందికి పదోన్నతి కల్పించటం పట్ల తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వంగ రవీందర్ రెడ్డి, కే గౌతమ్ కుమార్ లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం మంత్రిని సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు 45 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించారని కొనియాడారు.

ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగులపై ఉంచిన నమ్మకాన్ని నిజాయితీగా, నిబద్ధతతో పనిచేసి నిలబెట్టుకుంటామన్నారు. 33 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ లకి సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు గా పదోన్నతితో ప్రారంభమైన ఈ ప్రమోషన్ల ప్రక్రియను కింది స్థాయి వరకు కొనసాగించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు. వెంటనే తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరాలని మంత్రిని కోరారు. మిగిలిన అర్హులైన డిప్యూటీ కలెక్టర్లులకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలన్నారు. సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల ప్రమోషన్ల వల్ల ఏర్పడిన 33 ఖాళీలను, 16 క్లియర్ ఖాళీలను, రెండు సంవత్సరాలుగా రిటైరైన/ / డిసెంబర్ లోపు రిటైర్ అవుతున్న 35 డిప్యూటీ కలెక్టర్ల ఖాళీలను, వివిధ డిపార్ట్మెంట్ ల నుంచి వచ్చిన దాదాపు 40 కి పైగా కాన్సెంట్/రిక్వయిర్మెంట్లను పరిగణనలోకి తీసుకొని తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి ఇవ్వాలని రెవెన్యూ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీసీఎల్ఏతో చర్చించి ప్రక్రియను పూర్తి చేయడానికి తగిన ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ సంఘం అధ్యక్షుడు చంద్రమోహన్, డిప్యూటీ కలెక్టర్లు కె.చంద్ర కళ, ఉపేందర్ రెడ్డి, రాజేశ్వరి, ట్రెసా రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ పి.రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు అన్వర్, సెక్రటరీ వాణిరెడ్డి, మాజీ వీఆర్వోల సంఘం అధ్యక్షుడు గోల్కొండ సతీష్ ఉన్నారు.

Next Story