- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంప్లాయ్ ఐడీలు ఇవ్వండి.. సీసీఎల్ఏను కోరిన ట్రెసా
వీఆర్ఏల నుంచి జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లు వెళ్లిన వారందరికీ ఎంప్లాయ్ ఐడీలు కేటాయించి వెంటనే జీతాలు చెల్లించాలని సీసీఎల్ఏ, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్‌ని ట్రెసా బృందం శనివారం కోరింది.

దిశ, తెలంగాణ బ్యూరో: వీఆర్ఏల నుంచి జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లు వెళ్లిన వారందరికీ ఎంప్లాయ్ ఐడీలు కేటాయించి వెంటనే జీతాలు చెల్లించాలని సీసీఎల్ఏ, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్‌ని ట్రెసా(తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్) బృందం శనివారం కోరింది. ఆఫీస్ సబార్డినేట్ల కోర్టు కేసు ముగిసినందున వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లుగా పే స్కేల్ కల్పించిన వారందరికీ వెంటనే ఐడీలు వచ్చేటట్లుగా చూడాలన్నారు. దీనిపై మిట్టల్ సానుకూలంగా స్పందించినట్లు ట్రెసా నాయకులు తెలిపారు. సీసీఎల్ఏను కలిసిన వారిలో ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్, ఉపాధ్యక్షులు బాణాల రాంరెడ్డి, రమేష్ పాక, నిజామాబాదు జిల్లా అధ్యక్షుడు రమన్ రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సుధాకర్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు వకీల్, వీఆర్ఏలు, ఆఫీస్ సభార్డినేట్లు తదితరులు ఉన్నారు.






