- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Transport: అధికారులతో మంత్రి పొన్నం జూమ్ మీటింగ్.. కీలక ఆదేశాలు జారీ
జనవరి 1 నుండి జనవరి 31 వరకు జరిగే జాతీయా రోడ్డు భద్రతా మాసాన్ని(National Road Safety Month) విజయవంతం చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Transport Minister Ponnam Prabhakar) పిలుపునిచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: జనవరి 1 నుండి జనవరి 31 వరకు జరిగే జాతీయా రోడ్డు భద్రతా మాసాన్ని(National Road Safety Month) విజయవంతం చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Transport Minister Ponnam Prabhakar) పిలుపునిచ్చారు. రవాణా శాఖ అధికారులతో(Transport department officials) జూమ్ మీటింగ్(Zoom meeting) లో పాల్గొన్న పొన్నం.. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. రోడ్డు భద్రతపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, రాష్ట్రంలో ఉన్న 97 ఆర్టీసీ డిపో లు, 62 రవాణా కార్యాలయాల్లో భద్రతా నియమాలతో అవగాహన కల్పిస్తూ.. బ్యానర్ ఏర్పాటు చేయాలని సూచించారు.
అలాగే రోడ్డు భద్రతా మాసంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్ లు భాగస్వామ్యం అయ్యేలా చూడాలని అన్నారు. ప్రతి పాఠశాలలో ట్రాఫిక్ అవేర్నెస్ పై అవగాహన కల్పించాలని రోడ్డు భద్రతా పై ఆర్టీసీ రవాణా శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. రోడ్డు భద్రతపై స్కూల్ విద్యార్థులతో అవగాహన ర్యాలీ, ట్రైనింగ్ క్లాస్ లు, వర్క్ షాప్ లు, సెమినార్ లు, కంటి చెకప్ క్యాంప్‌లు, డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. అంతేగాక విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రతి పాఠశాలలో రోడ్డు భద్రతా పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్(Education Department Principal Secretary Sridhar) తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలో కార్యక్రమాలు చేపట్టాలని డీజీపీ జితేందర్(DGP Jitender)కి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.
రెవిన్యూ పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో కూడా గ్రామీణ స్థాయి నుండి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల మరణాలను తగ్గించడానికి ఇప్పటికే రవాణా శాఖ పలు కార్యక్రమాలను చేపడుతోందని, ప్రతి పాఠశాల లో ఏర్పాటు చేసే ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్‌లను జనవరి లోపు 50 శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక ఆర్టీసీలో కొత్త బస్సుల యాక్షన్ ప్లాన్ పై అధికారులను ఆరా తీశారు. ఆర్టీసీలో కొత్తగా నియామకం కానున్న ఉద్యోగాల భర్తీ, ఇప్పటికే పెద్దపల్లి ఏటూరు నాగారం లకి మంజూరు చేసి ఆర్టీసీ బస్సు డిపోల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు పెండింగ్ లేకుండా చూసుకోవాలని, మధిర, కోదాడ, హుజూర్ నగర్, మంథని, ములుగు బస్ స్టేషన్ లో పునరాభివృద్ది తదితర వాటిపై అధికారులకు మంత్రి పొన్నం పలు సూచనలు చేశారు.






