- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ట్రాన్స్ జెండర్లు
by Ajay Maddhiboyina |
సర్పంచ్ ఎన్నికల ప్రచారం మొదలైంది. అభ్యర్థులు వినూత్న రీతిలో ప్రచారం చేస్తూ ఓటర్లను తమవైపుకు తిప్పుకుంటున్నారు. గ్రామంలో కోతుల సమస్య ఎక్కువగా ఉందని చింపాంజీల వేషం వేసుకుని కోతులను తరమడం,

X
దిశ, వెబ్ డెస్క్: సర్పంచ్ ఎన్నికల ప్రచారం మొదలైంది. అభ్యర్థులు వినూత్న రీతిలో ప్రచారం చేస్తూ ఓటర్లను తమవైపుకు తిప్పుకుంటున్నారు. గ్రామంలో కోతుల సమస్య ఎక్కువగా ఉందని చింపాంజీల వేషం వేసుకుని కోతులను తరమడం, గెలిస్తే ఉచితంగా కటింగ్ చేస్తామని హామీ ఇవ్వడం, బాండ్ పేపర్ పై హామీలు రాసివ్వడం ఇలాంటివి చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
ఇక తాజాగా కరీంనగర్ జిల్లా మానకొండూర్‌లో ఓ సర్పంచ్ అభ్యర్థి సైతం వినూత్న ప్రచారంతో ఆకట్టుకున్నాడు. తన ప్రచారాన్ని ట్రాన్స్ జెంటర్లతో చేయించాడు. టాన్స్ జెండర్ల ఆశీర్వాదం ఉంటే మంచిదని సెంటిమెంట్ తో వాళ్ల మద్దతు కోరాడు. ముందుగా వారి వద్ద ఆశీర్వాదం తీసుకుని తరవాత వారితో కలిసి ప్రచారం చేశాడు. ట్రాన్స్ జెండర్లు ప్రచారంలో పాల్గొనడంతో గ్రామస్థులు సైతం వారితో సరదాగా మాట్లాడారు. అంతేకాకుండా వారితో ఫోటోలు దిగేందుకు ఆసక్తిచూపించారు.
Next Story






