- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: ఐ బొమ్మ రవి కేసు డీల్ చేస్తున్న లేడీ ఆఫీసర్ ట్రాన్స్ ఫర్.. రాష్ట్రంలో పలువురు నాన్ కేడర్ ఎస్పీల బదిలీ
తెలంగాణలో అధికారుల బదీలల పర్వం కొనసాగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం పలువురు నాన్ కేడర్ ఎస్పీలను బదిలీ (non-cadre SPs) చేసింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సీసీఎస్ డీసీపీగా వి.అరవింద్ బాబు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా సుధీంద్ర, వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా దార కవిత, ఇంటెలిజెన్స్ ఎస్పీలుగా పి.కరుణాకర్, ఎస్వీఎన్ శివరామ్, ఆర్.జగదీశ్వర్ రెడ్డి, సైబరాబాద్ ఎస్‍బీ డీజీపీగా వైవీఎస్ సుధీంద్ర, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా సాయిశ్రీ, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌గా ఎం.రవీందర్‌రెడ్డి, సీఐడీ ఎస్పీగా ఎన్.అశోక్ కుమార్ బదిలీ అయ్యారు. కాగా ప్రస్తుతం సైబర్ క్రైమ్ డీసీపీగా ఉన్న దార కవిత (Cybercrime DCP Kavitha) బదిలీ చర్చనీయాంశంగా మారింది. ఐ బొమ్మ రవి కేసులో (ibomma case) కవిత కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇంకా కేసు విచారణ జరుగుతోంది. ఐ బొమ్మ రవిని పోలీసులు తమ కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఓ వైపు విచారణ కీలక దశలో ఉన్న సమంయలో కవిత బదిలీ జరగడం ఆసక్తిగా మారింది.






