- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: రైతుల లావాదేవీలు పూర్తి
సివిల్ సప్లైస్ శాఖ రబీ సీజన్‌కు సంబంధించి 10.2 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని విజయవంతంగా కొనుగోలు చేసిందని సివిల్ సప్లయిస్ కమిషనర్ ఎం.స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సివిల్ సప్లైస్ శాఖ రబీ సీజన్‌కు సంబంధించి 10.2 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని విజయవంతంగా కొనుగోలు చేసిందని సివిల్ సప్లయిస్ కమిషనర్ ఎం.స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. కనీస మద్దతు ధర కింద ప్రభుత్వం ఇప్పటికే రూ.500.20 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లోకి విడుదల చేసిందని పేర్కొన్నారు. ఈ కొనుగోలు ప్రక్రియ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా రైతుల లావాదేవీలు పూర్తయ్యాయని తెలిపారు. భారీగా వస్తున్న ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి, సివిల్ సప్లయిస్ శాఖ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మొత్తం 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచే ఉన్నాయని.. రైతుల నుండి ధాన్యాన్ని సేకరిస్తున్నాయని తెలిపారు. వీటిలో పీఏసీఎస్ ద్వారా 4,350 కేంద్రాలు, ఐకేపీ ద్వారా 3,563 కేంద్రాలు, ఇతర సంస్థల ద్వారా 662 కేంద్రాలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. రైతులు సన్న, దొడ్డు రకాల ధాన్యాన్ని పెద్ద మొత్తంలో కేంద్రాలకు తీసుకువస్తున్నారని.. ఇప్పటివరకు ప్రభుత్వం 4.50 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు చేసిందని.. 5.50 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యాన్ని సేకరించిందని తెలిపారు.






