Trains Delay: విరిగిన క్లస్టర్ గేట్.. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం

by Kema Shiva Kumar |

రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన ఘటన పెద్దపల్లి (Peddpally) జిల్లా కూనారం (Kunaram) వద్ద చోటుచేసుకుంది.

Trains Delay: విరిగిన క్లస్టర్ గేట్.. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
X

దిశ, వెబ్‌డస్క్: రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన ఘటన పెద్దపల్లి (Peddpally) జిల్లా కూనారం (Kunaram) వద్ద చోటుచేసుకుంది. ఆర్వోబీ (ROB) వద్ద ఉన్న క్లస్టర్ ఒక్కసారిగా విరిగిపోవడంతో పలు ట్రైన్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా కాజీపేట్-బలర్షా (Kazipet-Balarsha) రూట్‌లో రైళ్ల సేవలు నిలిచిపోయాయి. ఆర్‌వోబీ నిర్మాణంలో భాగంగా రైల్వే ట్రాక్‌పై గడ్డర్లు ఏర్పాటు చేసేందుకు నిర్మించిన ఇనుప క్లస్టర్‌ బ్రేక్ అవ్వడంతో ఎక్కడికక్కడ పనులు ఆగిపోయాయి. అయితే, ఆ క్లస్టర్‌ పూర్తిగా విరిగితే గడ్డర్లు రైల్వే ట్రాక్‌పై పడి భారీ ప్రమాదం సంభవించేది. ప్రస్తుతం క్లస్టర్‌‌ పునరుద్ధరించేందుకు అధికారులు మరమ్మతులు పనులు చేపడుతున్నారు. ఈ పరిణామంతో కాజీపేట - బలర్షా మార్గంలో మొత్తం 15కు పైగా ట్రైను పెద్దపల్లి, రాఘవపూర్‌, కొలనూరు, జమ్మికుంట, మంచిర్యాల స్టేషన్లలో నిలిచిపోయాయి.

Next Story