- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళ శిక్షణ ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు బీరు కంపెనీ పరిశీలిన అవకాశం
మూడు దశాబ్ధాల అనంతరం తొలిసారిగా బీరు, మద్యం తయారు అయ్యే కంపెనీలతోపాటు , మద్యం అమ్మకాలు జరిపే డిపోలను సందర్శించే అవకాశం మహిళ శిక్షణా కానిస్టేబుళ్లకు వచ్చిందని ఎక్సయిజ్ ఆకాడమీ జాయింట్ డైరెక్టర్ శశీధార్‌రెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : మూడు దశాబ్ధాల అనంతరం తొలిసారిగా బీరు, మద్యం తయారు అయ్యే కంపెనీలతోపాటు , మద్యం అమ్మకాలు జరిపే డిపోలను సందర్శించే అవకాశం మహిళ శిక్షణా కానిస్టేబుళ్లకు వచ్చిందని ఎక్సయిజ్ ఆకాడమీ జాయింట్ డైరెక్టర్ శశీధార్‌రెడ్డి అన్నారు. గత నెలలో ఎక్సయిజ్ శాఖ మంత్రి పర్యటించిన సందర్భంలో మహిళ కానిస్టేబుళ్ళలో వినూత్న ప్రణాళికలతో శిక్షణ ఇవ్వాలని సూచించారని తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు అకాడమిలో శిక్షణ పోందుతున్న మహిళ కానిస్టేబళ్ళతో శుక్రవారం మల్లేపల్లిలో ఉన్న యునైటేడ్ బేవరేజెస్ కింగ్ ఫిషర్ బీర్ కంపెనీని పరిశీలించినట్లు తెలిపారు. 29 సంవత్సరాల చరిత్రలో తొలిసారిగా యూబీ కింగ్ ఫిషర్ బీరు కంపెనీ పరిశీలించే అవకాశం లభించదని తెలిపారు.
గతంలో ఎప్పుడు ఎక్సైజ్ అకాడమీలో శిక్షణ పొందుతున్న వారికి ఈ అవకాశం రాలేదని తెలిపారు. బీరు బాటిళ్లను శుభ్రపరచడం నుంచి బీరు తయారీ, ప్యాకింగ్ విభాగాల వరకు బీరు కంపెనీ కస్టర్ హెడ్ జయతీ షెకావత్ డీస్పాచ్ ఇంచార్జీలు హీస్‌తోష్ అధికారులు కానిస్టేబుళ్లకు వివరించారు. అనంతరం బీరు తయారీపై పవర్ ప్రజేంటేషన్‌ను ఇచ్చారు. శనివారం కూడా శిక్షణ కానిస్టేబుళ్లకు మద్యం తయారీ డిస్ట్రలరీ కంపెనీతో పాటు మద్యం డిపోలను పరిశీలించనున్నారని డైరెక్టర్ శశీధార్‌రెడ్డి అన్నారు. మార్చి 6న టీజీ ఇంటిగ్రేటేడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను కూడా పరిశీలించడానికి అనుమతి వచ్చిందని తెలిపారు.






