- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్ఐఆర్ పై అధికారులకు శిక్షణ
అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరును ఓటరు జాబితాలో చేర్చాలని, అనర్హుల పేర్లను జాబితా నుంచి తొలగించాలని భారత ఎన్నికల సంఘం త్వరలో రాష్ట్రంలో నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరును ఓటరు జాబితాలో చేర్చాలని, అనర్హుల పేర్లను జాబితా నుంచి తొలగించాలని భారత ఎన్నికల సంఘం త్వరలో రాష్ట్రంలో నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయంలో అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డా. వాసం వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా జిల్లా ఎన్నికల అధికారులు (డీఈఓలు), ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్ఓలు), అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఏఈఆర్ఓలు), బీఎల్ఓ సూపర్ వైజర్లు తదితర ఎన్నికల అధికారులకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఈఓ అధికారులను ద్దేశించి మాట్లాడుతూ డీఈఓ, ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బీఎల్ఓ సూపర్వైజర్లు, బీఎల్ఓల బాధ్యతలపై, ఎస్ఐఆర్ ప్రక్రియలో ఐటీ సంబంధిత కార్యకలాపాల గురించి వివరించారు. శిక్షణ కార్యక్రమంలో రాష్ట్ర నోడల్ అధికారి ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలను, అలాగే ఎస్ఐఆర్ అమలు ప్రక్రియలో ఉండే దశలు, విధానాలు తదితర అంశాలపై పలు సూచనలు చేశారు.
ప్రాజెక్ట్ మేనేజర్ (ఐటీ) ఈసీఐ నెట్ మాడ్యూల్స్, ఎస్ఐఆర్ దశలు — ప్రీ డ్రాఫ్ట్, పోస్ట్ డ్రాఫ్ట్, బీఎల్ఓ యాప్, సాంకేతిక అంశాలు, ఎన్యూమరేషన్ ఫారమ్‌ను ఎలా నింపాలో వంటివి వివరించారు. అలాగే ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న పలువురు అధికారులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు , జిల్లా ఎన్నికల అధికారులు, సంబంధిత ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లు, డిప్యూటీ సీఈఓ, సీఈఓ కార్యాలయ రాష్ట్ర నోడల్ అధికారులు , సంబంధిత సిబ్బంది కూడా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.






