- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎక్సైజ్ అకాడమీలో ఏఈఎస్, ఎస్సైలకు శిక్షణ ప్రారంభం.. గ్రూప్ 1,2 ద్వారా ఎంపికైన 115 మంది అభ్యర్థులు
గ్రూపు 1,2 ద్వారా ఎంపికైన 115 మంది అభ్యర్థులకు శనివారం ఎక్సైజ్ అకాడమీలో శిక్షణ ప్రారంభించారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: గ్రూపు 1,2 ద్వారా ఎంపికైన 115 మంది అభ్యర్థులకు శనివారం ఎక్సైజ్ అకాడమీ (Excise Academy)లో శిక్షణ ప్రారంభించారు. ఈ మేరకు ఆకాడమీ డైరెక్టర్ సయ్యద్ యాసిన్ ఖురేషి, జాయింట్ డైరెక్టర్ శశిధర్‌రెడ్డిలు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్ 1 నుంచి 31 మంది ఎక్సైజ్ ఏఈఎస్ (అసిస్టెంట్ సూపరిడెంట్) అభ్యర్థులుగా, గ్రూపు 2 ద్వారా ఎక్సైజ్ ఎస్సైలుగా 84 మంది అభ్యర్థుల ఎంపికైనట్లు వెల్లడించారు. వరంగల్ జోన్, హైదరాబాద్ జోన్ పరిధిలో ఆరు నెలల పాటు ఎక్సైజ్ అకాడమీ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణలో గ్రూపు 1 ద్వారా ఏఈఎస్‌లుగా చేరిన 31మందిలో 8మంది మహిళలు, 23 మంది పురుషులు ఉన్నట్టు పేర్కొన్నారు. గ్రూప్ 2 ద్వారా ఎస్సైలుగా చేరిన వారిలో 24 మంది మహిళలు, 60 మంది పురుషులు ఉన్నట్లు తెలిపారు.
Next Story






