- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖోఖో ఆడుతుండగా తీవ్ర విషాదం.. ఒక్కసారిగా కుప్పకూలిపోయిన తొమ్మిదో తరగతి విద్యార్థి
గణతంత్ర వేడుకల వేళ విషాదం చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: గణతంత్ర వేడుకల్లో(Republic Celebrations) విషాదం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా నార్పూర్ జడ్పీ పాఠశాల(Narpur ZP School)లో గణతంత్ర వేడులు నిర్వహించేందుకు సిబ్బంది సర్వం సిద్ధం చేశారు. ఈ వేడుకల దృష్ట్యా విద్యార్థులకు ఆటల పోటీలు(Games competitions) నిర్వహించారు. క్రికెట్, వాలీబాల్, ఫుల్ బాట్, రన్నింగ్ వంటి క్రీడలు బాగానే ఉన్నా ఖోఖో మాత్రం పాఠశాల విద్యార్థులను శోకసంద్రంలోకి ముంచెత్తింది. పాఠశాలలో గురువారం ఖోఖో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 9వ తరగతి విద్యార్థి బన్నీ కూడా పాల్గొన్నారు.
అయితే ఖోఖో(Khokho) ఆడుతుండగా బన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తోటి విద్యార్థులు వెంటనే వెళ్లి చూసే సరికి బన్నీ స్పృహలో లేడు. దీంతో బన్నీని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినిని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అయితే బన్నీ గుండెకు ఇప్పటికే స్టంట్ వేసి ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో తోటి విద్యార్థులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎంతో ఉత్సాహంగా తమతో ఆడే బన్నీ ఇక లేడని తెలిసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






