పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో విషాదం.. అల్లు అర్జున్‌కు వార్నింగ్ ఇచ్చిన ACP మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-06 06:28:06  IST  )

పుష్ప-2 తొక్కిసలాట ఘటనపై ఏకంగా హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun)పై ప్రెస్ మీట్ పెట్టి వార్నింగ్ ఇచ్చిన ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి (ACP Vishnu Murthy) గుండెపోటుతో కన్నుమూశారు.

పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో విషాదం.. అల్లు అర్జున్‌కు వార్నింగ్ ఇచ్చిన ACP మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: పుష్ప-2 తొక్కిసలాట ఘటనపై ఏకంగా హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun)పై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టి వార్నింగ్ ఇచ్చిన ACP సబ్బతి విష్ణుమూర్తి (ACP Vishnu Murthy) గుండెపోటుతో కన్నుమూశారు. సుదీర్ఘ కాలం పాటు డిపార్ట్‌మెంట్‌లో వివిధ హోదాల్లో ఆయన కొనసాగారు. తలపై మూడు సింహాలే దైవం నమ్మి నిరంతరం ప్రజా సేవ, ప్రజల భద్రత కోసం నిత్యం కృషి చేసిన వ్యక్తి విష్ణుమూర్తి అని సహచరులు కొనియాడారు. కాగా, హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం రాత్రి విష్ణుమూర్తి హార్ట్ అటాక్‌తో తుది శ్వాస విడిచారు. పోలీసు శాఖలో ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ పలువురు ఆయనకు నివాళులర్పిస్తున్నారు.

అల్లు అర్జన్‌పై విష్ణుమూర్తి వ్యాఖ్యలు ఇవే..

నాడు ప్రెస్‌క్లబ్‌లో అల్లు అర్జున్‌పై పెట్టిన ప్రెస్‌మీట్‌‌లో ఏసీపీ విష్ణుమూర్తి మాట్లాడుతూ.. డబ్బు మదంతో బడాబాబులు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ముద్దాయిగా ఉన్న అల్లు అర్జున్ వ్యక్తి ప్రెస్‌మీట్ పెట్టి తన తప్పేం లేదని చెబుతున్నాడని కామెంట్ చేశారు. పోలీసులనే బద్నాం చేస్తూ ప్రజలకు తప్పుడు సంకేతాలిస్తున్నాడని ఆరోపించారు. తన పని రాజ్యాంగానికి, చట్టానికి లోబడి ఉందో.. లేదో ముందు తెలుసుకోవాలని, పాలు తాగే పిల్లడు అల్లు అర్జున్ కాదని విష్ణుమూర్తి అన్నారు. అల్లు అర్జున్ తన పరిధిని దాటి మాట్లాడకూడదని కామెంట్ చేశారు.ఒకవేళ పరిధి దాటి ప్రవర్తిస్తే ప్రజలు ఇబ్బంది పడతారని ఫైర్ అయ్యారు. అర్జెంట్ ఉంది కాబట్టి బందోబస్తు కావాలంటే సాధ్యం కాదని.. ప్రొసీజర్ ప్రకారమే వెళ్లాలని చెప్పామని అన్నారు. కాగితం ఇచ్చి బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పి వెళ్లిపోతే అయిపోతుందా.. తమకు రూల్స్ ఉండవా..? అని ప్రశ్నించారు. పోలీసులను బూతులు తిడుతున్నారని, రాజకీయ నేతలు నోరు జారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బందోబస్తులో ఉంటే తాము ఒక్క 10 నిమిషాలు వదిలేసి‌పోతే సెలబ్రెటీల బతుకులు ఆగమైతాయనే విషయాన్ని గుర్తుంచుకోలన్నారు. తాము మనుషులమేనని, తమకు ఆకలి, దప్పిక, ఫ్యామిలీ ఉంటుందని విష్ణుమూర్తి ఆ ప్రెస్‌మీట్‌లో చెప్పుకొచ్చారు.

Next Story