Breaking News: కృష్ణా నదిలో విషాదం.. గల్లంతైన ఇద్దరు బాలుర మృతదేహాలు లభ్యం!

by Ramesh Naini |   (  Updated:2026-03-11 09:29:55  IST  )

సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కృష్ణా నదిలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఇద్దరు బాలురు విగతజీవులుగా దొరికారు.

Breaking News: కృష్ణా నదిలో విషాదం.. గల్లంతైన ఇద్దరు బాలుర మృతదేహాలు లభ్యం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కృష్ణా నదిలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఇద్దరు బాలురు విగతజీవులుగా దొరికారు. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా, చింతలపాలెం మండలం, చింత్రియాల గ్రామం వద్ద ఇద్దరు బాలురు పుట్టిలో (చిన్న పడవలో) చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో గల్లంతయ్యారు. బాలురు గల్లంతైన విషయం తెలుసుకున్న వెంటనే స్థానికులు, గజ ఈతగాళ్లు నదిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరణించిన బాలురను సమీర్ (15), సద్దాం (13) లుగా గుర్తించారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Next Story