శంషాబాద్ విమానాశ్రయంలో విషాదం.. ఇథియోపియా నుండి వచ్చిన బాలిక మృతి

by Ajay Maddhiboyina |

శంషాబాద్ విమానాశ్ర‌యంలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇథియోపియా నుండి క్యాన్స‌ర్ చికిత్స కోసం హైద‌రాబాద్ కు వ‌స్తున్న ఓ బాలిక ప్ర‌యాణ‌స‌మ‌యంలోనే క‌న్నుమూసింది.

శంషాబాద్ విమానాశ్రయంలో విషాదం.. ఇథియోపియా నుండి వచ్చిన బాలిక మృతి
X

దిశ‌, వెబ్ డెస్క్: శంషాబాద్ విమానాశ్ర‌యంలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇథియోపియా నుండి క్యాన్స‌ర్ చికిత్స కోసం హైద‌రాబాద్ కు వ‌స్తున్న ఓ బాలిక ప్ర‌యాణ‌స‌మ‌యంలోనే క‌న్నుమూసింది. విమానంలో బాలిక ఒక్క‌సారిగా అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో సిబ్బంది వైద్య స‌హాయం అందించేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ అప్ప‌టికే బాలిక ప‌రిస్థితి విష‌మించి క‌న్నుమూసింది. శంషాబాద్ లో విమానం ల్యాండ్ అయిన వెంట‌నే ఆ బాలికను ఎయిర్ పోర్టులోని అపోలో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మెరుగైన చికిత్స కోసం తీసుకువ‌స్తున్న స‌మ‌యంలో బాలిక మ‌ర‌ణించడంతో ఆ కుటుంబం క‌న్నీరుమున్నీరైంది.

Next Story