యాదిగాని పెళ్లికి స్టెప్పులేయడానికి సిద్ధంకండి.. ‘ఓ సుకుమారి’ సెకండ్ సింగిల్ అప్డేట్

by Mallepaka Hamsa |

ఈ సినిమా నుండి రెండో పాటకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు.

యాదిగాని పెళ్లికి స్టెప్పులేయడానికి సిద్ధంకండి.. ‘ఓ సుకుమారి’ సెకండ్ సింగిల్ అప్డేట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో తిరవీర్, ఐశ్వర్య రాజేష్ కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఓ సుకుమారి’. ఈ చిత్రాన్ని భరత్‌దర్శన్ తెరకెక్కిస్తుండగా.. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో తిరువీర్ యాదగిరి పాత్రలో నటిస్తుండగా.. గ్రామీణ రొమాంటిక్ కామెడీ చిత్రంగా రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ జర్నీని ప్రారంభించిన చిత్రబృందం, విడుదల చేసిన మొదటి పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుండి రెండో పాటకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ ‘యాదిగాని పెళ్లి’ అని సాగబోతోంది. ఈ ఊరమాస్ వెడ్డింగ్ సాంగ్‌ను జూన్ 29న ఉదయం 11:11 గంటలకు గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

ఈ అప్‌డేట్‌ను షేర్ చేస్తూ.. "యాదిగాని పెళ్లి పాట రాబోతోంది, స్టెప్పులేయడానికి అందరూ సిద్ధంకండి!" అంటూ ఒక ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌ను కూడా జత చేశారు. భరత్ మంచీరాజు ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో, ఈ పెళ్లి పాట మాస్ ఆడియన్స్‌ను ఊపేస్తుందని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే పాట రిలీజ్ డేట్‌తో పాటు చిత్ర యూనిట్ ఒక అందమైన పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో హీరో తిరువీర్, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ సాంప్రదాయబద్ధంగా పెళ్లి పీటలపై కూర్చుని ఒకరినొకరు చూసుకుంటూ మురిసిపోతున్నారు. పల్లెటూరి వాతావరణంలో పెళ్లి వైబ్‌‌తో ఈ పోస్టర్ నెటిజన్లను ఎంతగానో మెస్మరైజ్ చేస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయడానికి మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది.

Next Story