మంత్రి పొన్నంకు వినతిపత్రం అందజేసిన సర్పంచ్

by Kodari Anjali |

ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామ సర్పంచ్ మంత్రి పొన్నంను మర్యాదపూర్వకంగా కలిసి ఈజీఎస్ ద్వారా 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం నిర్మాణానికి రూ.3 లక్షలు మంజూరు చేయాలని వినతిపత్రాన్ని అందజేశారు.

మంత్రి పొన్నంకు వినతిపత్రం అందజేసిన సర్పంచ్
X

దిశ, ఎల్లారెడ్డిపేట: హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను శనివారం రాచర్ల గొల్లపల్లి గ్రామ సర్పంచ్ కొండ రమేష్ గౌడ్, బొప్పాపూర్ ఉపసర్పంచ్ కొండపురం వెంకట్ రెడ్డి లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఈజీఎస్ ద్వారా 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం నిర్మాణానికి రూ.30,00,000/- (ముప్పై లక్షలు) మంజూరు చేయాలని వినతిపత్రాన్ని అందజేశారు. రాచర్ల గొల్లపల్లి గ్రామంలో సుమారు 75 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, గ్రామంలో ధాన్యం నిల్వ చేసుకునేందుకు సరైన గోదాం సౌకర్యం లేక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పత్రంలో తెలిపారు. దీంతో పంటను తక్కువ ధరలకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని మంత్రికి వివరించారు. వినతిపత్రంపై వెంటనే స్పందించిన పొన్నం సంబంధిత అధికారులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. బొప్పాపూర్ ఉప సర్పంచ్ వెంకట్ రెడ్డి మా గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేసి గ్రామ అభివృద్ధికి సహకరించాలని మంత్రిని కోరారు. వారి వెంట గ్రామ యువకులు పొన్నాల వెంకటేష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఉన్నారు.

Next Story