బంగ్లాదేశ్ నుంచి యువతుల అక్రమ రవాణా

by Muthe.Rajitha |

బంగ్లాదేశ్ నుంచి యువతులను ఆక్రమ రవాణ చేసి వ్యభిచారాలు చేయిస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడుతన్న వారిపై హైదరాబాద్ ఈడి అధికారులు కేసులు నమోదు చేసినట్లు గురువారం వెల్లడించారు.

బంగ్లాదేశ్ నుంచి యువతుల అక్రమ రవాణా
X

దిశ, తెలంగాణ బ్యూరో : బంగ్లాదేశ్ నుంచి యువతులను ఆక్రమ రవాణ చేసి వ్యభిచారాలు చేయిస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడుతన్న వారిపై హైదరాబాద్ ఈడి అధికారులు కేసులు నమోదు చేసినట్లు గురువారం వెల్లడించారు. రెండు కేసులకు సంబంధించి మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఏ) నిబంధనల ప్రకారం రూ. 1.90 లక్షల (సుమారు) విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసినట్లు తెలిపారు. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన రెండు ఎఫ్ ఐ ఆర్ ల ఆధారంగా ఈడి అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కోన్నారు. తెలంగాణ పోలీసులు హైదరాబాద్ శివార్లలో బంగ్లాదేశ్ జాతీయులు నిర్వహిస్తున్న రెండు వ్యభిచార గృహాలపై చేపట్టిన దాడులలో ఛత్రినాక, షహడ్ షరిఫ్ పిఎస్ లో కేసులు నమోదు అయినట్లు తెలిపారు. బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్లోని అక్రమ సరిహద్దు క్రాసింగ్ ద్వారా ఏజెంట్ల సహయంతో యువతులను ఆక్రమంగా హైదరాబాద్కు తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.

బ్యూటీ పార్లర్లు, టైలర్ షాపులు, స్టీల్ ఫ్యాక్టరీలు, గృహిణులు మొదలైన వాటిలో మెరుగైన జీతంతో ఉద్యోగాలు ఇస్తామనే తప్పుడు సాకుతో బాధిత బాలికలను భారతదేశంలోకి అక్రమంగా రవాణా చేసి వారితో వ్యభిచారం చేయిస్తున్నారని పేర్కోన్నారు. ఈడీ చెపట్టిన దర్యాప్తులో ఒక ఎఫ్‌ఐఆర్‌లో ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధించిందబడిందని వివరించారు. ఈడి అటాచ్ చేసిన ఆస్తులు పేటిఎం వాలెట్లు, బ్యాంకు ఖాతాలలోని బ్యాలెన్స్ మొత్తాల రూపంలో ఉన్నాయిని తెలిపారు. నిందితులలో ఒకరైన రుహుల్ అమీన్ ధాలీ స్థిరాస్తి రూపంలో ఉందని గుర్తించినట్లు తెలిపారు. అతను బంగ్లాదేశ్ అమ్మాయిలను భారతదేశంలోకి అక్రమ రవాణా చేస్తున్న వారిలో పాల్గొన్న ప్రముఖ ఏజెంట్లలో ఒకరని గుర్తించినట్లు తెలిపారు. కేసు తదుపరి విచారణలో ఉన్నట్లు వెల్లడించారు.

Next Story