హైదరాబాద్‌లో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు.. అందుబాటులోకి మరో ఆర్వోబీ

by Vemula.Srinu Prasad |

హైదరాబాద్‌లో మరో ఆర్వోబీ అందుబాటులోకి వస్తుండటంతో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి...

హైదరాబాద్‌లో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు.. అందుబాటులోకి మరో ఆర్వోబీ
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో రోజు రోజుకు వాహన, ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు పెరుగుతున్నాయి. సులువైన ప్రయాణం కోసం ఇప్పటికే చాలా ఫ్లైఓవర్, ఆర్వోబీలు నిర్మించారు. అయినా సరే ప్రతినిత్యం చాలా ప్రాంతాల్లో ప్రయాణం నరకంగా మారింది. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కు కోవాల్సి వస్తుంది. రూట్లలో ఎన్ని మార్పులు చేసినా ఇక్కట్టు తప్పడంలేదు. మెట్రో ఉన్నప్పటికీ ప్రయాణికులు బస్సులు, కార్లు, బైకులపైనే జర్నీ చేస్తున్నారు. దీంతో రోడ్లపై రద్దీ పెరుగుతోంది. సిగ్నల్ వేసినా, చిన్న ఘటన జరిగినా రోడ్లపై వాహనాలు బారులు తీరుతున్నాయి. ఈ నేపథ్యంలో గమ్యస్థానాలకు చేరుకోవడంలో ఆలస్యమవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ జామ్ అవుతున్న ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ ఆర్వోబీలను నిర్మిస్తోంది.


ఇలా హైదరాబాద్ పాతబస్తీలో నిర్మించిన మరో ఆర్వోబీ శుక్రవారం అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్ నుంచి ఫలక్ నుమా బ్రాడ్ గేజ్ లైన్ వద్ద ఉన్న బ్రిడ్జికి సమాంతరంగా చేపట్టిన ఆర్వోబీ పనులు పూర్తి అయ్యాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఆర్వోబీని శుక్రవారం ప్రారంభించనున్నారు. బాస్కర్ జంక్షన్ నుంచి ఫలక్ నుమా బస్ డిపో, రైల్వే స్టేషన్, చార్మినార్ వైపు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గనున్నాయి.

Next Story