INDvsAUS: రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. పార్కింగ్ స్థలాలు ఇవే!

by Disha Web Desk 2 |
INDvsAUS: రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. పార్కింగ్ స్థలాలు ఇవే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రేపు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడో టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు నుంచి ఆటగాళ్ళను భారీ బందోబస్తు మధ్య నగరంలోని స్టార్ హోటల్‌కు తరలించనున్నారు. ఈ నేపథ్యంలోనే రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. రేపు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌ జరగనున్న సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే భారీ వాహనాలను అనుమతించమన్నారు. సికింద్రాబాద్ నుంచి, ఎల్‌బీనగర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను కూడా అనుమతించమని పోలీసులు స్పష్టం చేశారు. స్టేడియం నలువైపులా ఐదు క్రైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మ్యాచ్‌ నేపథ్యంలో 21 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసామని.. గేట్ నెంబర్1 ద్వారా విఐపీ, వివిఐపీల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఒక్కొక్క పార్కింగ్‌లో 1400 కార్లు పట్టేలా ప్రత్యేక పార్కింగ్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సాయంత్రం నాలుగు గంటల నుండి స్టేడియం వైపు భారీ వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

సైబరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు:

మరోవైపు రేపు సైబరాబాద్‌లోనూ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. గ్యాథరింగ్‌ సైక్లింగ్‌ కమ్యూనిటీ మారథాన్‌ సందర్భంగా ఉదయం 5 నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ ప్రోగ్రాంలో 1000 మంది సైక్లిస్టులు కేబుల్‌ బ్రిడ్జిపై హాజరవుతారని సైక్లింగ్‌ సంఘం నిర్వాహకులు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఐటీసీ కోహినూర్‌, ఐకియా, రోటరీ, కేబుల్‌ బ్రిడ్జి, ఎన్‌సీబీ జంక్షన్‌, గచ్చిబౌలి రోడ్డు నంబర్‌-45, దుర్గంచెరువు, జూబ్లీహిల్స్‌ ఇనార్బిట్‌ మాల్‌, సీవోడీ జంక్షన్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ డైవర్షన్స్‌ ఉంటాయని డీసీపీ తెలిపారు. ఉదయం 8 గంటల ట్రాఫిక్‌ యథావిధిగా కొనసాగిస్తామన్నారు.

Also Read : ఆ షాట్లు ఆడటంలో రోహిత్ ఇబ్బంది పడుతున్నాడు.. గవాస్కర్ షాకింగ్ కామెంట్స్



Next Story

Most Viewed