Ganesh immersion: ట్రాఫిక్ ఇంక్షలు మరింత కఠినం.. మెట్రో ప్రయాణికులకు శుభవార్త

by Gantepaka Srikanth |

గణపతి నిమజ్జనాల వేళ గ్రేటర్ హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. రేపు రాత్రి 11 గంటల వరకు నగరంలోకి లారీలకు అనుమతి నిరాకరించారు.

Ganesh immersion: ట్రాఫిక్ ఇంక్షలు మరింత కఠినం.. మెట్రో ప్రయాణికులకు శుభవార్త
X

దిశ, వెబ్‌డెస్క్: గణపతి నిమజ్జనాల వేళ గ్రేటర్ హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. రేపు రాత్రి 11 గంటల వరకు నగరంలోకి లారీలకు అనుమతి నిరాకరించారు. మెహిదీపట్నం, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్‌ వరకు ఆర్టీసీ బస్సులకు అనుమతి ఇచ్చారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల బస్సులకు చాదర్‌ఘాట్‌ వరకు అనుమతి ఇచ్చారు. రాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైలు సర్వీసులకు అవకాశం కల్పించారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు ప్రధాన రూట్లపై ట్రాఫిక్ నియంత్రణలు అమలవుతాయి. కీలక జంక్షన్లైన కేశవగిరి, చంద్రాయణగుట్ట, లిబర్టీ, ట్యాంక్ బండ్ వంటి ప్రదేశాల్లో వాహన రాకపోకలను మళ్లించేందుకు ఏర్పాట్లు చేశారు. RTC, ఇంటర్‌స్టేట్ బస్సులను పునఃమార్గదర్శనం చేస్తున్నారు, భారీ వాహనాలపై నిషేధం విధించారు. ప్రయాణికులు PVNR ఎక్స్‌ప్రెస్‌వే లేదా ఔటర్ రింగ్ రోడ్‌ను వినియోగించాలని సూచించారు.

Next Story