వాహనదారులకు అలర్ట్.. రేపు ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!

by Disha Web Desk 19 |
వాహనదారులకు అలర్ట్.. రేపు ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా లైవ్‌ కన్సర్ట్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కాన్సర్ట్ కోసం హైదరాబాద్ పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. గచ్చిబౌలి ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ట్రాఫిక్‌ మళ్లింపు, భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ నారాయణ నాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు జరగనున్న ఇళయరాజా లైవ్‌ కన్సర్ట్‌కు 17,520 మంది హాజరయ్యే అవకాశం ఉందని సీపీ తెలిపారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్‌ మళ్లింపు ఉంటుందన్నారు. కాగా, ఈ కాన్సర్ట్ కి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నేతలు హాజరుకానున్నారు.

ట్రాఫిక్ డైవర్షన్స్...

లింగంపల్లి నుంచి గచ్చిబౌలి జంక్షన్‌కు వచ్చే వాహనాలను హెచ్‌సీయూ బస్‌ డిపో వద్ద ఎస్‌ఎంఆర్‌ వినయ్‌సిటీ, మసీద్‌బండ, బొటానికల్‌ గార్డెన్, గచ్చిబౌలి వైపు వెళ్లాల్సి ఉంటుంది. గచ్చిబౌలి సర్కిల్‌ నుంచి లింగంపల్లికి వెళ్లే వాహనాలు బొటానికల్‌ గార్డెన్, మసీద్‌బండ, హెచ్‌సీయూ బస్‌ డిపో వైపు వెళ్లాల్సి ఉంటుందన్నారు. రాయదుర్గం నుంచి లింగంపల్లి వైపు వచ్చే వాహనాలను ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ నుంచి గోపీచంద్‌ అకాడమీ, విప్రో సర్కిల్, క్యూసిటీ, గోపన్‌పల్లి, నల్లగండ్ల ఫ్లై ఓవర్‌ నుంచి వెళ్లాలన్నారు.

లింగంపల్లి నుంచి గచ్చిబౌలి జంక్షన్, గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వైపు భారీ వాహనాల రాకపోకలపై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. ట్రక్కులు, లారీలు, వాటర్‌ ట్యాంకర్లు, డీసీఎంలు, ఆర్‌ఎంసీ వాహనాలపై ఆంక్షలు ఉంటాయన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలని కోరారు.

Next Story

Most Viewed