- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాదీలకు అలర్ట్.. రేపు ఈ రూట్‌లలో ట్రాఫిక్ ఆంక్షలు
రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మల్కాజ్‌గిరి పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

దిశ, వెబ్ డెస్క్: రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మల్కాజ్‌గిరి పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 1గంట నుండి రాత్రి 9 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. బేగంపేట నుండి సంగీత్ జంక్షన్ వైపు వెళ్లే వాహనాలు ప్యారడైజ్ పాట్నీ క్లాక్ టవర్ సంగీత్ మార్గాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అంతేకాకుండా సంగీత్ నుండి బేగంపేట వైపు వచ్చే వాహనాలను కూడా ఇదే మార్గంలో అనుమతించనున్నారు. బేగంపేట నుండి తిరుమలగిరి వెళ్లే వాహనాలు ఫ్లైఓవర్లు-సెయింట్ జాన్స్ రోటరీ- షెనాయ్ నర్సింగ్ హోం-ఏఓసీ సెంటర్- కేవీ- తిరుమలగిరి మార్గంలో వెళ్లాలని సూచించారు.
తిరుమలగిరి నుండి బేగంపేటకు వచ్చే వాహనాలు కూడా ఇదే మార్గం గుండా వెళ్లాలని సూచించారు. బాలానగర్ నుండి సికింద్రాబాద్ వెళ్లే వాహనాలను బాలనగర్ జంక్షన్-ఫతేనగర్-అమీర్ పేట్-పంజాగుట్ట-బేగంపేట మార్గం వైపు మళ్లించనున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా పంజాగుట్ట-బేగంపేట-రసూల్ పురా జంక్షన్- మినిస్టర్స్ రోడ్-రాణిగంజ్-సికింద్రాబాద్ మార్గాన్ని వినియోగించుకోవచ్చని వెల్లడించారు. మనరోవైపు సికింద్రాబాద్ నుండి తిరుమలగిరి వెళ్లే వాహనాలు క్లాక్ టవర్-సంగీత్-సెయింట్ జాన్స్ రోటరీ-షెనాయ్ నర్సింగ్ హెం-ఏఓసీ-కేవీ-తిరుమలగిరి మార్గంలో వెళ్లాలని సూచించారు.
సికింద్రాబాద్ నుండి బోయిన్ పల్లి వెళ్లే వాహనాలు క్లాక్ టవర్-పాట్నీ-పారడైజ్-సీటీఓ-బోయిన్ పల్లి మార్గాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇక ట్యాంక్ బండ్ నుండి తిరుమలగిరి వెళ్లే వాహనాలు పారడైజ్-సీటీఓ-తాడ్ బండ్-డైమండ్ పాయింట్-బోయిన్ పల్లి మార్కెట్- తిరుమలగిరి మార్గం వైపు మళ్లించబడతాయని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులు, ఇతర భారీ వాహనాలు పరేడ్ గ్రౌండ్స్ వైపు వెళ్లే రహదారులను వీలైనంతవరకు నివారించాలని పోలీసులు సూచించారు. అంతే కాకుండా మెట్రో సేవలను వినియెగించుకునేందుకు ప్రయత్నించాలని కోరారు.






