- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Traffic Alert : హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు..
ఇండియా స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన ‘వార్-2’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: (Traffic Alert) ప్యాన్ ఇండియా స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన ‘వార్-2’ (War 2 pre-release) సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలు ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో జరుగనున్నాయి. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ టాప్ హీరోలు అయిన (NTR, Hrithik Roshan) ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న ఈ ‘వార్-2’పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. దీంతో జరగబోయే ప్రీ-రిలీజ్ వేడుకలకు అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండటంతో యూసఫ్‌గూడ (Yousufguda) పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 5 నుంచి 10 గంటల వరకు వాహనదారులు యూసఫ్‌గూడ స్టేడియం వైపు వెళ్లకుండా ఉండాలని, ప్రత్యామ్నాయ మార్గాల్లో పోవాలని హైదరబాద్ పోలీస్‌లు ఇవాళ ఎక్స్ వేదిక ఒక ప్రకటన విడుదల చేశారు. హెల్ప్‌లైన్ కోసం 9010203626 నంబర్‌కు సంప్రదించవచ్చని, సోషల్ మీడియా @HYDP ఖాతాను ఫాలో కావొచ్చని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఇక, యూసఫ్‌గూడలో జనరల్ పబ్లిక్ కోసం పార్కింగ్ సుదుపాయం మెట్రో పార్కింగ్ (జానకమ్మ తోట 1&2), సవేరా ఫంక్షన్ హాల్, మహమ్మద్ ఫంక్షన్ హాల్లో ఫోర్ వీలర్ పార్కింగ్ అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు.






