రవాణ, ట్రాఫిక్ పోలీసులకు ట్రాఫిక్ మేనేజ్మెంట్ శిక్షణ

by Muthe.Rajitha |

అధ్యయనం ఒక నిరంతర ప్రక్రియ, అభ్యాసం జీవితాంతం కొనసాగే ప్రయాణం.

రవాణ, ట్రాఫిక్ పోలీసులకు ట్రాఫిక్ మేనేజ్మెంట్ శిక్షణ
X

దిశ, తెలంగాణ బ్యూరో : అధ్యయనం ఒక నిరంతర ప్రక్రియ, అభ్యాసం జీవితాంతం కొనసాగే ప్రయాణం. రోజురోజుకు పుట్టుకొస్తున్న నూతన సాంకేతికతను అందుకోవడం వలన మాత్రమే ఇంజనీరింగ్ సవాళ్లను, నిర్వహణ నైపుణ్యాలను, వివిధ కేస్ స్టడీల అధ్యయనంతో నిర్ణయాల తీసుకునే సామర్థ్యంతో పాటుగా సమయానికి ముందే ప్రాజెక్టులు పూర్తి చేయడం జరుగుతుంది’ అని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ జి. రామేశ్వర రావు అన్నారు. సివిల్ ట్రాన్స్ పోర్టేషన్ ఇంజనీరింగ్, మేనేజిమెంట్ టెక్నాలజీ, క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ డివిజన్స్ ఏర్పాటు చేసిన డిజిటల్ ట్రాన్సఫార్మేషన్ ఇన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్, పంప్స్ ఆపరేషన్ ఫర్ ఆయిల్ అండ్ గ్యాస్ అప్లికేషన్స్, లీన్ సిక్స్ సిగ్మా గ్రీన్ బెల్ట్ ట్రైనింగ్ కార్యక్రమాలను రామేశ్వర్ రావు సోమవారం కాలేజీలోని కన్వెన్షన్ సెంటర్ లో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన అభ్యర్థులు, వివిధ డివిజన్ హెడ్స్ సమక్షంలో ప్రారంభించారు.

ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలోని పన్నెండు డివిజన్స్ ద్వారా గత నాలుగు దశాబ్దాలకు పైగా ఇస్తున్న శిక్షణతో ఇంజనీర్స్, సైంటిస్ట్, టెక్నో మేనేజర్స్ సిబ్బందిలో పెరిగిన నైపుణ్యాభివృద్ధితో ఉత్పాదకత పెరిగి సుస్థిర అభివృద్ధికి బాటలు వేస్తాయన్నారు రామేశ్వర్ రావు ఈ సందర్బంగా అన్నారు. సివిల్ ట్రాన్స్ పోర్టేషన్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ ఆర్. వెంకట రెడ్డి మాట్లాడుతూ ఐదురోజులు కొనసాగే డిజిటల్ ట్రాన్సఫార్మేషన్ ఇన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ శిక్షణ కోసం అస్సాం, ఒరిస్సా, మహారాష్ట్ర, త్రిపుర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, కేరళ, ఢిల్లీ రాష్ట్రాల సీనియర్ ట్రాన్స్ పోర్ట్ అధికారులు, పోలీస్ అధికారులు హాజరైన ఈ శిక్షణ కార్యక్రమం భారత ప్రభుత్వ మిసిస్త్రీ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హై వేస్ ఆధ్వర్యంలో నిపుణులైన సీనియర్ ఫ్యాకల్టీలతో నిర్వహిస్తున్నామని అన్నారు.

ఈ శిక్షణలో స్మార్ట్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ అండ్ ట్రాఫిక్ మేనేజెమెంట్, ఇంటర్ కనెక్టెడ్ వెహికల్స్ అండ్ ఐ ఓ టి ఇంటెగ్రేషన్ తదితర అనేక విషయాలపై ఫ్యాకల్టీ లు ఇచ్చే శిక్షణను అభ్యర్థులు వినియోగించుకోవాలన్నారు. మహేంద్ర యూనివర్సిటీ అందించే ఇన్ పుట్స్ ను కూడా ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన అభ్యర్థులతో పాటుగా ఇస్కీ చీఫ్, డిప్యూటీ చీఫ్ లక్ష్మి కాంత రావు, డాక్టర్ పి రాజారావు తదితరులు పాల్గొన్నారు . డాక్టర్ భరత్ కార్యక్రమ నిర్వహణ యాంకరింగ్ చేశారు.

Next Story