- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Alert: విజయవాడ-హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ జామ్
by Ramesh Naini |
విజయవాడ-హైదరాబాద్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: విజయవాడ-హైదరాబాద్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరుస సెలవులు రావడంతో నగరవాసులు పెద్ద సంఖ్యలో తమ స్వగ్రామాల వైపు బయలుదేరడంతో హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. ముఖ్యంగా నల్గొండ జిల్లా పెద్దకాపర్తి సమీపంలో బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.
రోడ్డు విస్తరణ, ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల తరబడి వాహనాల్లోనే ఉండాల్సి రావడంతో కుటుంబాలతో ప్రయాణిస్తున్న వారు అసహనం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Next Story






