- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికే ప్రాధాన్యత
మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికీ పదవుల కేటాయింపులో మొదటి ప్రాధాన్యత ఉంటుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి..

- పార్టీ మారి వచ్చిన వారికీ రెండో ప్రాధాన్యత
- గాంధీభవన్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికీ పదవుల కేటాయింపులో మొదటి ప్రాధాన్యత ఉంటుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గురువారం గాంధీభవన్లో హైదరాబాద్ జిల్లా నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ మారి వచ్చిన వారికి రెండో ప్రాధాన్యత ఉంటుందన్నారు. హైదరాబాద్ పరిధిలోకి వచ్చే 15 నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ స్థానాల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసిన, డీసీసీ అధ్యక్షులు, సీనియర్, ముఖ్య నాయకుల అభిప్రాయం తీసుకున్నారు. పార్టీ పదవుల కోసం నాయకులు ఇచ్చిన పేర్లు పరిశీలించి కమిటీలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలకు, అన్ని కులాల వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారన్నారు. శుక్రవారం మూడు జిల్లాలకి సంబంధించిన అబ్జర్వర్లు, పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జిలతో సమావేశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ముందుగా లిస్ట్ ఇంఛార్జీ ఇచ్చిన తర్వాత టీపీసీసీ చీఫ్, ఇంఛార్జీ అనుమతితో డివిజన్ వారిగా సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.






