TPCC: రాముడి మీద ప్రమాణం చేస్తారా..? బీజేపీ నేతలకు సామా రామ్మోహన్ సంచలన సవాల్

by Ramesh Goud |

రేషన్ కార్డులు(Ration Cards) ఇచ్చామని రాముల వారి మీద ప్రమాణం చేస్తారా? అని బీజేపీ నేతలకు, టీపీసీసీ(TPCC) మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి(Sama Rammohan Reddy) సవాల్ విసిరారు.

TPCC: రాముడి మీద ప్రమాణం చేస్తారా..? బీజేపీ నేతలకు సామా రామ్మోహన్ సంచలన సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: రేషన్ కార్డులు(Ration Cards) ఇచ్చామని రాముల వారి మీద ప్రమాణం చేస్తారా? అని బీజేపీ నేతలకు, టీపీసీసీ(TPCC) మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి(Sama Rammohan Reddy) సవాల్ విసిరారు. గాంధీభవన్(Gandhi Bhavan) లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి పేదలకు ఇస్తున్న పథకాలపై మోడీ(Modi) పేరు పెట్టాలా? ప్రజలే చెప్పాలన్నారు. రూపాయి సహాయం చేయని కేంద్ర ప్రభుత్వం(Union Government) మనపై పెత్తనం చెలాయించాలని చూస్తోందని అన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన వాటాలను తీసుకొస్తారని, రాష్ట్రానికి ఆర్థికంగా సహాయం చేస్తారని ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను(BJP MPs) పార్లమెంట్ పంపిస్తే.. గుజరాత్ గులాములుగా మారి తెలంగాణ ప్రజలనే బెదిరిస్తున్నారని తెలిపారు.

బొమ్మ పెట్టకపోతే సంక్షేమ పథకాలు ఇచ్చేది లేదని మాట్లాడుతున్నారని, కేంద్రప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చిందా? అని, ఒక్క రైతుకైనా రుణమాఫీ చేసిందా అని ప్రశ్నించారు. 2014 నుంచి ఇప్పటివరకు బీజేపీ మేనిఫెస్టోలలో చెప్పిన వాటికే దిక్కు లేదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణకు ఐటీఐఆర్ వచ్చిందని, దానిని కూడా ఎగరేసుకొని పోయారని, బండి సంజయ్ దాని గురించి కొట్లాడితే బాగుంటుందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు గ్రామాలలో ఇచ్చిన దాఖలాలు లేవని, బీజేపీ నాయకుల తీరు రూ.501 చందా రాసి మండపానికి నా పేరే పెట్టాలి అన్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. అలాగే 2014 నుంచి ఇప్పటివరకు కేంద్రప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని చెప్పారు. ఒక వేళ ఇచ్చినట్లు ఉంటే రాముల వారి మీద, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్పాలన్నారు. ఇద్దరు కేంద్రమంత్రులు ఉండి తెలంగాణ హక్కుల గురించి కొట్లాడాల్సింది పోయి, బొమ్మ పెట్టకపోతే ఇవ్వమని మాట్లాడటం సిగ్గు చేటన్నారు. మీరు పథకాలు ఇస్తారా ఇవ్వరా అనేది పక్కన పెడితే.. మీ బెదరింపులు చూసి ప్రజలు మీ బొమ్మను ఉంచుతారో, ఉంచరో ప్రజలకే వదిలేస్తున్నామని కాంగ్రెస్ నేత అన్నారు.

Next Story