- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Satish: తెలంగాణలో ఫ్యాక్షనిజానికి తెరలేపుతున్నారా?
బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో అరాచకాలకు పాల్పడుతున్నారని టీపీసీసీ సోషల్ మీడియా, టీజీటీఎస్ చైర్మన్ సతీష్ విమర్శించారు. సోషల్ మీడియా పోస్ట్‌పై నిజానిజాలు అడిగినందుకు రాజేంద్ర అనే వ్యక్తి ఇంటికి వెళ్లి క్రిశాంక్ దాడి చేయడం దురదృష్టకరమన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో అరాచకాలకు పాల్పడుతున్నారని టీపీసీసీ సోషల్ మీడియా, టీజీటీఎస్ చైర్మన్ సతీష్ విమర్శించారు. సోషల్ మీడియా పోస్ట్‌పై నిజానిజాలు అడిగినందుకు రాజేంద్ర అనే వ్యక్తి ఇంటికి వెళ్లి క్రిశాంక్ దాడి చేయడం దురదృష్టకరమన్నారు. ఇళ్ల మీదకు వెళ్లి దాడి చేయడం వంటి చర్యలతో తెలంగాణలో ఫ్యాక్షనిజానికి తెరలేపుతున్నారా? ఇది ఏ రకమైన సంస్కృతి? అని ప్రశ్నించారు. ఇంట్లో పెద్దవాళ్లు ప్రాధేయపడుతున్నా వినకుండా బెదిరింపులకు దిగడం అన్యాయమని చెప్పారు. ముఖ్యమంత్రి, ఇతర నాయకులపై క్రిశాంక్ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు.
అసెంబ్లీలో మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడిన వాస్తవాలను తట్టుకోలేక, వారిని కౌంటర్ చేయడానికే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. అంగన్‌వాడీ టీచర్ల మొబైల్ ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అవాస్తవ ప్రచారం చేస్తున్నదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా, అత్యంత పారదర్శకంగా ఓపెన్ టెండర్ల ద్వారానే మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియ జరిగిందన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఈ ఆరోపణలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు.






