TG: ఎనిమిది మందితో కమిటీ ఏర్పాటు

by Gantepaka Srikanth |

టీపీసీసీ ప్రోటోకాల్ అండ్ కోఆర్డినేషన్ కమిటీని టీపీసీసీ చీఫ్ మహేష్​కుమార్ గౌడ్ నియమించారు.

TG: ఎనిమిది మందితో కమిటీ ఏర్పాటు
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీపీసీసీ ప్రోటోకాల్ అండ్ కోఆర్డినేషన్ కమిటీని టీపీసీసీ చీఫ్ మహేష్​కుమార్ గౌడ్ నియమించారు. ఈ కమిటీకి చైర్మన్‌గా హార్కర వేణుగోపాల్ రావును నియమిస్తూ ఈ మేరకు మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ వైస్ చైర్మన్‌గా కిశోర్ రెడ్డి, కన్వీనర్‌గా ఎం.ఏ. ఫహీమ్ నియమితులయ్యారు. కమిటీ సభ్యులుగా ఎన్. భాను ప్రకాష్ రెడ్డి, కేవీ ప్రసాద్, సూరజ్ తివారి, సూదిని మహేందర్, అల్లం రాకేష్ నియమితులయ్యారు. ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ సూచనల మేరకు ఈ కమిటీని పునర్‌వ్యవస్థీకరించినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

Next Story