- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు 7 మార్కులు కలపాల్సిందే'
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ ఎనిమిదేళ్ల పాలనలో రాష్ట్రంలోని నిరుద్యోగులకు నిరాశే మిగిల్చారని లేఖలో సర్కార్‌ను విమర్శించారు. ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష ప్రశ్నాపత్రంలో అవకతవకలు ఉన్నాయని ఆరోపించారు. ఈ విషయమే ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు మంత్రి కేటీఆర్, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డికి విన్నవించుకున్నా ప్రభుత్వం వద్దనుంచి సమాధానం రాలేదని గుర్తుచేశారు. ప్రిలిమ్స్‌లో తప్పుగా వచ్చిన ఏడు ప్రశ్నలను తొలగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తప్పుడు ప్రశ్నల వల్ల దేహదారుడ్య పరీక్షలకు అర్హత కోల్పోయిన అభ్యర్థులకు ఆ ఏడు మార్కులు కలిపి మళ్లీ అవకాశం కల్పించాలని కోరారు.
Next Story






