- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ బయటకు రాకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే!
కేసీఆర్ బయటకు రాకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే!

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) అన్నారు. మంగళవారం గాంధీ భవన్‌లో మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. 90 శాతం సర్పంచ్‌లు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు ఎన్నికయ్యారని అన్నారు. నా స్వగ్రామం రహత్ నగర్‌లో ఎస్టీ అభ్యర్థి విద్యావంతుడు తిరుపతి ఏకగ్రీవంగా కావడం ఎన్నుకోవడం శుభ పరిణామమని హర్షం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలుపు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి నిదర్శనమన్నారు. సన్నబియ్యం మొదలు ఇందిరమ్మ ఇళ్ల వరకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. గ్లోబల్ సమ్మిట్‌తో ఊహించని విధంగా పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. ఫోర్త్ సిటీ చారిత్రాత్మక నిర్ణయం కాబోతోందని తెలిపారు. ప్రపంచం ఆశ్చర్య పోయేలా ఫోర్త్ సిటీ ఉండబోతోందని అన్నారు. గ్లోబల్ సమ్మిట్‌లో ప్రఖ్యాతి చెందిన కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు.
పెట్టుబడులు రావడం శుభ పరిణామమని.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులందరికీ అభినందనలు తెలిపారు. పదేళ్ల విధ్యంసం నుంచి వికాసం వైపు రాష్ట్రం పయనిస్తోంది.. సకల సదుపాయాలతో ఫోర్త్ సిటీ నిర్మాణం కాబోతోందని అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ పని అయిపోయింది. పదేళ్లు పాలించిన పార్టీ రెండేళ్లలోనే కనుమరుగు అయిందంటే.. ప్రజల్లో ఏ మేరకు వ్యతిరేకత ఉందో తెలుసుకోవచ్చు అని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరిట దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఇక బీఆర్ఎస్‌ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని.. ఆ విషయం తెలిసిన తర్వాతే కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కు పరిమితం అయ్యారు.. అందుకే జూబ్లీహిల్స్‌లో ప్రచారం కూడా చేయలేదని అన్నారు.






