- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ఆచరణలో చూపిన నాయకుడు
మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి 84వ జయంతి సందర్భంగా ఆయనకు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఘన నివాళులు అర్పించారు.

కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ఆచరణలో చూపిన నాయకుడు
ఉత్తమ పార్లమెంటేరియన్‌గా నిలిచిన ఘనత ఆయనదే
మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి 84వ జయంతి సందర్భంగా ఘన నివాళులు
టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజాసేవకు ప్రతీకగా నిలిచిన ఉత్తమ పార్లమెంటేరియన్ దివంగత మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి 84వ జయంతి సందర్భంగా ఆయనకు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఘన నివాళులు అర్పించారు. జైపాల్ రెడ్డి దేశ రాజకీయాల్లో అపూర్వమైన వ్యక్తిత్వం గల వ్యక్తి, సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజల కోసం నిరంతరం పోరాడిన మహానాయకుడని ఆయన కొనియాడారు. విద్య, పర్యావరణం, భూసంస్కరణలు, పరిశ్రమలు, సమాచార సాంకేతికత వంటి కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తూ దేశ అభివృద్ధిలో విశేష పాత్ర పోషించారని గుర్తు చేశారు. ప్రత్యేకించి తెలంగాణ ప్రజల హక్కుల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర స్థాయిలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యం పట్ల ప్రగాఢ నమ్మకం కలిగిన నాయకుడిగా జైపాల్ రెడ్డి తరతరాలకు ఆదర్శమని అన్నారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా ప్రజల పక్షానే నిలబడి ప్రశ్నించే స్వభావం ఆయనకు ప్రత్యేక గుర్తింపునిచ్చిందన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆలోచనలు, విధానాలు మార్గదర్శకమని, యువత ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉందని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ఆచరణలో చూపిన నాయకుడిగా ఆయన సేవలను పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే మనమిచ్చే నిజమైన ఘన నివాళి అవుతుందని పేర్కోన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.






