జంప్ పాలిటిక్స్ కొంత కాలమే బాగుంటుంది.. లాంగ్ పాలిటిక్స్ లో అది సాధ్యం కాదు

by Ajay Maddhiboyina |

కాంగ్రెస్ లో ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్న అనేక మంది నేతలు గతంలోఎన్ఎస్ యూఐ, యూత్ కాంగ్రెస్ లలో పని చెసినవారే, ఎన్ఎస్ యూఐ, యూత్ కాంగ్రెస్ లలో పని చేస్తే కాంగ్రెస్ లో మంచి భవిష్యత్ ఉంటదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

జంప్ పాలిటిక్స్ కొంత కాలమే బాగుంటుంది.. లాంగ్ పాలిటిక్స్ లో అది సాధ్యం కాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ లో ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్న అనేక మంది నేతలు గతంలోఎన్ఎస్ యూఐ, యూత్ కాంగ్రెస్ లలో పని చెసినవారే, ఎన్ఎస్ యూఐ, యూత్ కాంగ్రెస్ లలో పని చేస్తే కాంగ్రెస్ లో మంచి భవిష్యత్ ఉంటదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. యూత్ నాయకులు గ్రౌండ్ లో పని చేస్తేనే గుర్తింపు ఉంటుందని, గ్రామాలలో పనిచేస్తే ప్రజల నాడీ తెలుస్తుందని ఆయన సూచించారు. శనివారం గాంధీ భవన్ ప్రాంగణంలోని ఇందిరా భవన్ లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ నేతలు, జిల్లాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో విత్ ఐవైసి యాప్, పలు అంశాలపై నేతలకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా మహేష్ కుమార్ గౌడ్ సర్పంచ్ లెవెల్స్ లో, ఎంపీపీ, జడ్పీటీసీల్లో కూడా పోటీలో ఉండాలన్నారు.

యూత్ కాంగ్రెస్ లో పని చేసిన నాయకులకు కార్పోరేషన్ చైర్మన్ లు, డీసీసీ అధ్యక్షులు అయ్యారని, కాంగ్రెస్ లోనే ఇలాంటి అవకాశాలు ఉంటాయని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. యూత్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ అని, మీలాంటి వారు ఉంటేనే ఒక నాణ్యమైన నాయకత్వం వస్తుందన్నారు. జంప్ పాలిటిక్స్ చేస్తే కొంత కాలం బాగుంటుందని, లాంగ్ పాలిటిక్స్ లో అది సాధ్యం కాదన్నారు. రాహుల్ గాంధీ ఎన్ఎస్ యూఐ, యూత్ కాంగ్రెస్ లు అంటే చాలా ఇష్టపడుతారని, మీరు భవిష్యత్ లో మరింత మంచి అవకాశాలు సాధించాలి .. కష్టపడితే మంచి భవిష్యత్ ఉంటుంది.. యూత్ కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేయాలి.. మీకు మంచి భవిష్యత్ ఉంది.. రాబోయే రోజుల్లో మీకు ఇంకా మంచి పదవులు వస్తాయని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ బలోపేతానికి మరింత కృషి చేయాలని, స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో వైట్ టీ షర్ట్ క్లబ్ లను నిర్వహించి, ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తూ, బీజేపీ, ఈసీ కలిసి చేస్తున్న ఓటు చోరిని ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ జాతీయ ఇంచార్జ్ మణీష్ శర్మ, రాష్ట్ర ఇంచార్జ్ సయ్యద్ ఖలీద్, కో ఇంచార్జ్ లు రోష్ని జైస్వాల్, భవ్య, జాతీయ కార్యదర్శి మమత నాగిరెడ్డి, జ్యోతిష్ తదితరలు పాల్గొన్నారు.

Next Story