- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ జిల్లా కార్యవర్గం ఏర్పాటుకు టీపీసీసీ మార్గదర్శకాలు
కాంగ్రెస్ జిల్లా కమిటీల కూర్పుపై టీపీసీసీ కసరత్తులు మొదలు పెట్టింది. దీనిలో భాగంగా డీసీసీ అధ్యక్షులకు జిల్లా కార్యవర్గాల ఏర్పాటుకు సంబంధించి

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ జిల్లా కమిటీల కూర్పుపై టీపీసీసీ కసరత్తులు మొదలు పెట్టింది. దీనిలో భాగంగా డీసీసీ అధ్యక్షులకు జిల్లా కార్యవర్గాల ఏర్పాటుకు సంబంధించి వివిధ హోదాల, సంఖ్యా విధానాలపై టీపీసీసీ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్, ఇంచార్జ్ సెక్రటరీలు విశ్వనాథన్ పెరమాళ్, సచిన్ సావంత్ లు నిర్వహించిన విస్తృత చర్చల అనంతరం ఈ మార్గదర్శకాలను జిల్లా నాయకులు, బాధ్యులు విధిగా పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా కార్యవర్గంలో...
జిల్లా నుంచి ఒక కోశాధికారి పదవిని కేటాయించాలి. ఉపాధ్యక్ష పదవికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి బ్లాక్ నుంచి ఒకరు, ఒక నియోజకవర్గంలో ఎన్న బ్లాకులు ఉంటే అంతమందిని ఈ పదవిలో నియమించవచ్చు. ప్రధాన కార్యదర్శి పదవికి ప్రతి అసెంబ్లీ నియోజకరవర్గంలో, ప్రతి బ్లాక్ నుంచి ఇద్దరు చొప్పున నియమించాలి అంటే నియోజకవర్గంలో రెండు బ్లాకులుంటే నలుగురు ప్రధాన కార్యదర్శులు ఉంటారని పేర్కొన్నారు. కార్యదర్శి పదవికి ప్రతి మండలానికి ఒకరు చొప్పున ఎంపిక చేయాలి. జిల్లాలో ఉన్న మొత్తం మండలాల సంఖ్యకు అనుగుణంగా కార్యదర్శుల సంఖ్య ఉండాలి. జిల్లా అధికార ప్రతినిధి పదవికి ప్రతి నియోజకవర్గాన్ని ఒకరు చొప్పున నియమించాలి. జిల్లా కార్యవర్గ సభ్యుల నియామకంలో గరిష్టంగా 15 మంది వరకూ సంఖ్యను నియమించుకోవచ్చు. జిల్లా పార్టీకి చెందిన సీనియర్ నేతలకు ఈ కమిటిలో ప్రాతినిథ్యం కల్పించుకోవచ్చు. అయితే సంఖ్యను టీపీసీసీ చీఫ్ అనుమతితో తుది నిర్ణయం తీసుకుంటారు.
కార్పోరేషన్ మున్సిపాలిటీ నుంచి ప్రాతినిధ్యం...
ఉపాధ్యక్ష పదవి ఒక బ్లాక్ నుంచి ఒక్కరికి మాత్రమే అవకాశం. ప్రధాన కార్యదర్శులు ప్రతి 10వార్డులకు ఒకరు చొప్పున నియామకం ఉంటుంది. కార్యదర్శులు ప్రతి 5వార్డులుకు ఒకరు చొప్పున నియామకం ఉంటుంది. కార్యవర్గ సభ్యులు ఆయ పట్టణాల్లోని వార్డుల సంఖ్య ఆధారంగా నిర్ణయించాలి. ఒక కార్పోరేషన్ పరిధిలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయో వాటిని అనుసంధాన్ని పరిగణలోకి తీసుకొని జిల్లా కార్యవర్గాల కూర్పును చేసుకోవాలి. జిల్లా కార్యవర్గ కమిటి కూర్పు తుది రూపం దాల్చిన అనంతరం కమిటిని టీపీసీసీ అధ్యక్షుడు మాత్రమే ప్రకటిస్తారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు, ఉద్యమాలు, ధర్నాలు, ఆందోళనల సందర్భంలో నమోదైన కేసులు తప్ప ఇతర తీవ్ర క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తులను కార్యవర్గ కమిటీలో ఎట్టి పరిస్థితుల్లో పరిగణలోకి తీసుకోకూడదని స్పష్టం చేశారు. జిల్లా కార్యవర్గ కమిటీ ఏర్పాటు సమయంలో అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రానిథ్యం కల్పించాలి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మహిళలను సమతుల్యంగా పరిగణలోకి తీసుకొని 60శాతం సోషల్ ఇంజనీరింగ్ ను పాటించాలి. మహిళకు కనీసం 20 నుంచి 25శాతం డీసీసీ కమిటీల్లోని అన్ని స్థాయిల్లో అవకాశం కల్పించాలి. జిల్లా కార్యవర్గం ఏర్పాటులో సందేహాలు, భిన్నాభిప్రాయాలు లేదా అనివార్య పరిస్థితులు ఎదురైతే టీపీసీసీ చీఫ్అనుమతి తీసుకోవాలి. కొన్ని జిల్లాల్లో పక్క జిల్లాలకు చెందిన మండలాలు కలిసివున్నట్లైయితే ఆ మండలాలన్ని మండలంగా మరియు బ్లాక్ ను బ్లాక్ గా పరిగణించాలని పార్టీ ముఖ్యలు ఆదేశాలు జారీ చేశారు.






